వెండితెరపై అతన్ని వెట్రిమారన్ కంటే ఇంకెవరు బాగా చూపిస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ అరసన్. తెలుగులో ఈ సినిమాను సామ్రాజ్యం టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సామ్రాజ్యం టీజర్‌ను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Oct 19, 2025, 10:44:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఇటీవలే దేవర, వార్ 2 చిత్రాలతో అలరించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ అరసన్. ఈ సినిమాను తెలుగులో సామ్రాజ్యం అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు.

వెండితెరపై అతన్ని వెట్రిమారన్ కంటే ఇంకెవరు బాగా చూపిస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్
వెండితెరపై అతన్ని వెట్రిమారన్ కంటే ఇంకెవరు బాగా చూపిస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్

అనిరుధ్ రవిచందర్ సంగీతం

సామ్రాజ్యం సినిమాలో తమిళ స్టార్ శింబు హీరోగా చేస్తున్నాడు. వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రాక్ స్టార్’ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా సామ్రాజ్యం టీజర్‌ను రిలీజ్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్

సోషల్ మీడియాలో తారక్ సామ్రాజ్యం తెలుగు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బెస్ట్ ఇంకా రావాలి

“శింబు బెస్ట్ ఇంకా తెరపైకి రావాల్సి ఉంది. వెట్రిమారన్ కంటే వెండితెరపై అతడిని ఇంకెవరు బాగా చూపిస్తారు” అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. సాధారణంగా ప్రోమో కానీ, టీజర్ కానీ రెండు, మూడు నిమిషాల నిడివితో ఉంటాయి. కానీ, అందుకు భిన్నంగా ఐదున్నర నిమిషాల ప్రచార వీడియో విడుదల చేసింది 'సామ్రాజ్యం' చిత్ర బృందం.

సామ్రాజ్యం టీజర్

'సామ్రాజ్యం' టీజర్ ప్రారంభంలో విజువల్స్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కోర్టు బయట తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఓ వ్యక్తి కథ చెబుతున్న దృశ్యంతో ప్రోమో ప్రారంభమైంది.

మొత్తం రియాలిటీనే

'సార్.. నేను చెప్పబోయే మ్యాటర్ మొత్తం రియాలిటీ. నరికినోళ్లు, చచ్చినోళ్లు, స్థలం, పేరు, టైం, ఊరు.. మొత్తం రియాలిటీనే. కానీ, మీరు అలా చూపించకండి. ఈ సినిమాలో వచ్చేదంతా ఉట్టి భూటకం అని కార్డు వేస్తారు కదా! అలా వేయండి' అని శింబు చెబుతుంటారు.

ఎన్టీఆర్ అయితే అదరగొడతాడు

ఆ పాత్రలో ఎన్టీఆర్ అయితే అదరగొడతారని చెబుతారు. ఆ తర్వాత కోర్టులో వాయిదాకు సమయం కావడంతో వెళతారు. ముగ్గురు మనుషుల్ని అత్యంత కిరాతకంగా నరికి చంపిన కేసులో ఆయన ముద్దాయి. అయితే తాను ఎవరినీ చంపలేదని, తనపై అన్యాయంగా కేసు బనాయించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేస్తారు శింబు.

రెండు భిన్నమైన గెటప్పుల్లో

ప్రోమోలో రెండు భిన్నమైన గెటప్పుల్లో శింబు కనిపించారు. కోర్టు సన్నివేశాల్లో కాస్త నెరిసిన గడ్డంతో, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో యువకుడిగా ఉన్నారు. ఆ కేసు ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌గా సామ్రాజ్యం టీజర్ ఆకట్టుకుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More