తమిళం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి- ద్విభాషా చిత్రంగా రిలీజ్- పాపులర్ నటీనటులతో మూవీ!

కోర్ట్ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిపుల్ శ్రీదేవి అపల్లా తమిళంలోకి అడుగుపెట్టింది. జో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజన్ సినిమా హౌస్ బ్యానర్‌లో శ్రీదేవి తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Nov 16, 2025, 19:50:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కోలీవుడ్‌లో రీసెంట్‌గా ‘జో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ విజన్ మూవీ సంస్థ నుంచి తదుపరి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెంబర్ 3ని ప్రారంభించారు. ఈ సినిమా తెలుగు-తమిళ్ అంటూ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటోంది.

తమిళం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి- ద్విభాషా చిత్రంగా రిలీజ్- పాపులర్ నటీనటులతో మూవీ!
తమిళం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి- ద్విభాషా చిత్రంగా రిలీజ్- పాపులర్ నటీనటులతో మూవీ!

కోర్ట్ మూవీతో ఫేమ్

‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ వంటి సినిమాల్లో అద్భుతమైన నటనను కనబర్చి అందరినీ ఆకట్టుకున్న ఏగన్.. ‘కోర్ట్’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్ని పోషించనున్నారు.

విజయ్ బుల్గానిన్ సంగీతం

ఈ చిత్రం గురించి మేకర్స్ ఈరోజు (నవంబర్ 16) అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు రీసెంట్ సెన్సేషన్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘బేబీ’, ‘కోర్ట్’ అంటూ వరుసగా బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్ మ్యూజిక్‌ను విజయ్ బుల్గానిని అందించిన సంగతి తెలిసిందే.

ఆహా కళ్యాణం దర్శకుడు

ఇక ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ మరో హైలెట్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. ‘ఆహా కళ్యాణం’ సినిమాకు దర్శకత్వం వహించిన యువరాజ్ చిన్నసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

క్వాలిటీ కోసం

‘జో’ విజయం తర్వాత విజన్ సినిమా హౌస్ మంచి సబ్జెక్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే నిర్మాతలు డా. డి. అరుళనందు, మాథ్యూయో అరుళనందు క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారు.

సోషల్ మీడియా నుంచి

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు. ఇకపోతే సోషల్ మీడియా నుంచి హీరోయిన్‌గా ఎదిగిన వాళ్లలో కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ఉంది. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో హర్ష్ రోషన్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే.

విమర్శకుల ప్రశంసలు

రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన కోర్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఆడియెన్స్, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కోర్ట్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీదేవి అపల్లా ఇప్పుడు తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

తమిళంలో ఎలాంటి క్రేజ్

శ్రీదేవి ఆఫర్ అందుకున్న ఈ తమిళ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. మరి ఈ మూవీతో తమిళంలో శ్రీదేవి ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఇకపోతే ఈ తమిళ తెలుగు ద్విభాషా సినిమా ఏగన్, శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో తెరకెక్కడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More