AIBE 20 Hall Tickets : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AIBE - 20కి సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి.  రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో వీటిని పొందవచ్చు. https://www.allindiabarexamination.com/  వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈనెల 30వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Published on: Nov 16, 2025, 05:05:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ -20 కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నవంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలున్నాయి.

AIBE -20 హాల్ టికెట్లు విడుదల
AIBE -20 హాల్ టికెట్లు విడుదల

హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  2. హోం పేజీలో కనిపించే లాగిన్ పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ వివరాలను ఎంటర్ చేయాలి.
  3. అడ్మిట్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేస్తే…మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
  4. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. సిలబస్ ప్రకారం AIBE 20లో 19 అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల సమయం ఉంటుంది.

ఏఐబీఈ ఎగ్జామ్ - మార్కుల కేటాయింపు:

  • రాజ్యాంగ చట్టం (Constitutional Law): 10 ప్రశ్నలు
  • ఐ.పీ.సీ(ఇండియన్ పీనల్ కోడ్), (కొత్త) భారతీయ న్యాయ సంహిత: 8 ప్రశ్నలు
  • సీఆర్​పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), (కొత్త) భారతీయ నగరిక్ సురక్ష సంహిత: 10
  • సీ.పీ.సీ.(సివిల్ ప్రొసీజర్ కోడ్): 10 ప్రశ్నలు
  • ఎవిడెన్స్​ యాక్ట్​ (భారతీయ శక్ష అధినియం): 8 ప్రశ్నలు
  • మధ్యవర్తిత్వ చట్టంతో సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం: 4 ప్రశ్నలు
  • కుటుంబ చట్టం: 8 ప్రశ్నలు
  • ప్రజా ప్రయోజన వ్యాజ్యం: 4 ప్రశ్నలు
  • అడ్మినిస్ట్రేషన్ చట్టం: 3 ప్రశ్నలు
  • BCI నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ మిస్​కాండక్ట్​ కేసులు: 4 ప్రశ్నలు
  • కంపెనీ లా : 2 ప్రశ్నలు
  • పర్యావరణ చట్టం: 2 ప్రశ్నలు
  • సైబర్ లా : 2 ప్రశ్నలు
  • కార్మిక, పారిశ్రామిక చట్టం: 4 ప్రశ్నలు
  • మోటారు వాహన చట్టం, వినియోగదారుల రక్షణ చట్టంతో సహా లా ఆఫ్​ టోర్ట్: 5 ప్రశ్నలు
  • పన్నుకు సంబంధించిన చట్టం: 4 ప్రశ్నలు
  • కాంట్రాక్ట్ చట్టం, నిర్దిష్ట ఉపశమనం, ఆస్తి చట్టాలు, నెగోషియబుల్ ఇన్​స్ట్రుమెంట్ చట్టం: 8 ప్రశ్నలు
  • భూసేకరణ చట్టం: 2 ప్రశ్నలు
  • మేథో సంపత్తి చట్టాలు: 2 ప్రశ్నలు
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More