పెళ్లి, చావు దగ్గర కులం ఆడే ఆట- అదిరిపోయే డైలాగ్స్‌తో దండోరా ట్రైలర్- లవ్, ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో రిలీజ్
బిగ్ బాస్ శివాజీ, నందు, నవదీప్, బిందు మాధవి తదితరులు నటించిన లేటెస్ట్ సినిమా దండోరా. మురళీకాంత్ దర్శకత్వం వహించిన దండోరా డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం దండోరా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరి దండోరా ట్రైలర్ విశేషాలపై లుక్కేద్దాం.
వైవిధ్యమై ప్రమోషనల్ స్ట్రాటజీతో ‘దండోరా’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్‌ను పూర్తి చేసుకోవటం విశేషం. డిసెంబర్ 25న దండోరా మూవీ రిలీజ్ కానుంది. సినిమాలో బిగ్ బాస్ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు నటించారు.

క్రిస్మస్ సందర్భంగా
మంచి అంచనాలతో క్రిస్మస్ సందర్బంగా విడుదలవుతోన్న ‘దండోరా’ ట్రైలర్‌ను శుక్రవారం (డిసెంబర్ 19) విడుదల చేశారు మేకర్స్. కులం వంటి ఓ సెన్సిటివ్ విషయాన్ని కమర్షియల్ పంథాలో ఫన్నీగా ఆవిష్కరించారు డైరెక్టర్ మురళీకాంత్. ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
తాజాగా విడుదలైన ‘దండోరా’ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దండోరా ట్రైలర్‌ను గమనిస్తే.. ఊరి బయట కొంత మంది శవాన్ని మోసుకెళ్తుంటారు. ఇంత దూరం శవాన్ని ఎందుకు మోసుకు రావాలని వారితో పాటు వచ్చే చిన్న పిల్లాడు అడుగుతాడు.
దానికి వాళ్లు.. ‘మన చావు పుట్టకులన్నీ ఆ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు..’ డైలాగ్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత ‘విష్ణుగాడొచ్చి కాళ్లు పట్టుకున్నా పని కాదని సర్పంచ్ సాబ్ చెబుతున్నాడా అని నందుతో మురళీధర్ పాత్ర చెప్పగానే.. నువ్వు ఉన్నోడివి ఉండకుండా ఆ సర్పంచ్‌గానికి ఎందుకు చెప్పినావ్.. వాడేమన్నా పెద్ద లాడ్డా’ అని నందు చెప్పటం కామెడీ తెప్పిస్తుంది.
క్వార్టర్ గుద్ది ఇంట్లో పండినావో
‘ఒటేసినావ్‌రా అని’ నవదీప్ తన పక్కనున్న అతన్ని అడిగితే ‘ఎంత పెద్ద మాటన్నావ్ సర్పంచ్ నీ గుర్తుకే గుద్దినా’ అని వాడంటాడు. దానికి ‘ఓటుకి గుద్దినావో.. క్వార్టర్ గుద్ది ఇంట్లో పండినావో ఎవడు చూసిండవయ్యా’ అని నవదీప్ రియాక్ట్ కావటం బాగుంది.
‘ఒక ముద్దు పెట్టుకుంటానే అని రవికృష్ణ పాత్ర మణిక పాత్రను రిక్వెస్ట్ చేస్తే ఆమె ఏమో చెంప పగుల్తాది’ అని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తది. ‘సరే అయితే మా అయ్యతోని మాట్లాడి ముహూర్తం పెట్టించు.. డైరెక్ట్‌గా మండపానికి వస్తాను ’ అని మణిక రవికృష్ణతో చెప్పే సీన్ లవ్ ఫీల్ చూపిస్తోంది.
‘నాన్న లేడు అని చెప్పి ఇప్పుడేమో బాధ్యతలు చూపిస్తున్నాడు’ అంటూ నందుని తన భార్య తిట్టే డైలాగ్, నాగార్జున ఫొటోని బిందు మాధవి ముద్దు పెట్టుకుంటూ ‘ఎట్లున్నాం మేమిద్దరం’ అంటూ శివాజీని అడగటం తనేమో చిరు కోపంగా చూడటం వంటివి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.
సీరియస్ వార్నింగ్
మరో సీన్‌లో అయితే శివాజీ సీరియస్‌గా ఒకర్ని కాలితో తన్ని.. ‘భయపడ్డావా.. పడాలి’ అంటూ వార్నింగ్ ఇవ్వటం. ‘అయ్యిందేదో అయిపోయింది.. పెద్ద మనుషులు మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి’ అని మురళీధర్ పాత్ర రిక్వెస్ట్ చేయటం.. ‘పరిష్కారం లేదు.. బొంగులేదు.. వెళ్లి ఆ చెట్టు కింద కాల్చుకోండి’ అంటూ నందుని చూసి కుల పెద్దలు చెప్పటం.. నవదీప్ సీరియస్‌గా చూస్తుండటం ఉంటుంది.
మరో సీన్‌లో మణిక రవికృష్ణతో మాట్లాడుతూ ‘అయినా చిరంజీవిలా బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతావ్ కదా.. ఏదైనా చెయ్యొచ్చు కదా..’ అని అంటుంది. ‘చావు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేం రా’ అని మురళీధర్ పాత్ర నందుతో చెప్పటం సినిమా ఇంటెన్సిటీ చూపిస్తోంది.
‘ఒకటి పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర .. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి’ అంటూ కుల పెద్దలను ఉద్దేశించి వచ్చే డైలాగ్, ‘మన బతుకులు మారాలంటే మనకు కావాల్సిందొక్కటి.. చదువు..చదువు..’ అంటూ దేవీప్రసాద్ పాత్ర స్టేజ్ పై చెప్పటం.. వంటివి ఆకట్టుకున్నాయి.
నవదీప్ మాస్ స్టెప్స్
దండోరా ట్రైలర్ చివరలో నవదీప్ ‘కొట్రా డప్పు..’ అంటూ మాస్ స్టెప్స్ వేయటం.. అక్కడ వచ్చే టైటిల్ ట్రాక్, ఇలాంటి డైలాగ్స్ వింటూ ట్రైలర్ చూస్తుంటే సినిమాను ఎలాంటి డెప్త్‌తో తెరకెక్కించారనేది చెప్పేశారు మేకర్స్.
ఊర్లో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నవదీప్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతాడు. అక్కడి నుంచి ఊర్లో వచ్చే సమస్యలు, కుల పెద్దలకు, అతని వచ్చే ఘర్షణలు ఎలా ఉంటాయనే విషయాలను సన్నివేశాల రూపంలో చూపించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


