సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ కావాలి.. మాదీ అయితే సంతోషం.. సీనియర్ల తర్వాతే మేము.. ఏదో ఒక రోజు ఇరగదీస్తా: ప్రభాస్

ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డార్లింగ్స్ అంటూ చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వచ్చిన అతడు.. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లు కావాలని అన్నాడు. తనదైన స్టైల్ స్పీచ్ తో నవ్వించాడు.

Published on: Dec 28, 2025, 06:57:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెరిశాడు. ఈ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న ప్రభాస్.. తనదైన స్టైల్లో డార్లింగ్స్ అంటూ మాట్లాడాడు. మూవీతోపాటు సంక్రాంతి సినిమాలు, డైరెక్టర్ మారుతి, సీనియర్ హీరోల గురించి కూడా అతడు మాట్లాడిన విధానం అభిమానులను బాగా ఆకట్టుకుంది.

సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ కావాలి.. మాదీ అయితే సంతోషం.. సీనియర్ల తర్వాతే మేము.. ఏదో ఒక రోజు ఇరగదీస్తా: ప్రభాస్
సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ కావాలి.. మాదీ అయితే సంతోషం.. సీనియర్ల తర్వాతే మేము.. ఏదో ఒక రోజు ఇరగదీస్తా: ప్రభాస్

సంక్రాంతి సినిమాలపై..

డార్లింగ్స్ ఎలా ఉన్నారు అంటూ ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ మొదలుపెట్టాడు ప్రభాస్. సంక్రాంతి సినిమాలన్నీ హిట్ కావాలని అతడు కోరుకున్నాడు. తమ సినిమా కూడా అయితే బాగుంటుంది అంటూ సింపుల్ గా చెప్పడం చాలా మందిని ఆకర్షించింది.

సీనియర్ హీరోలపై..

ఈసారి సంక్రాంతికి చిరంజీవి మూవీ మన శంకరవరప్రసాద్ గారు కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలుసు కదా. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియాగా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నా ప్రభాస్ మాత్రం సీనియర్ హీరోలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తాజా స్పీచ్ తో తెలిసింది.

“చాలా ఇంపార్టెంట్ సీనియర్ సీనియరే.. సీనియర్ల నుంచే మేము నేర్చుకున్నాం.. సీనియర్ తర్వాతే మేము.. హండ్రెడ్ పర్సెంట్.. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ కావాలి” అని ప్రభాస్ అనడంతో ఫ్యాన్స్ పెద్దగా అరిచారు. అతని సింప్లిసిటీ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

ఏదో రోజు ఇరగదీస్తా

ఇక తన స్పీచ్ బోరింగ్‌గా అనిపిస్తుంది కదా అని తనపై తానే పంచ్‌లు వేసుకున్నాడు ప్రభాస్. అతడు మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ అందరూ బాహుబలి 2లోని ఇంటర్వెల్ సీన్ ను రీక్రియేట్ చేస్తూ.. బాహుబలి జయహో అని అరవడం మొదలుపెట్టారు.

దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. “నా స్పీచు ఇలాగే ఉంటది.. బోరింగ్‌గా అని బాహుబలి జయహో అంటున్నారు కదా. ఎప్పుడిలాగే చెబుతాడు. ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజ్ మీద.. షాకైపోతారు మీరందరూ. ఈరోజు మరీ ఎక్కువ మాట్లాడేశాను కదా. వస్తుంది వస్తుంది.. అప్పుడప్పుడూ వస్తుంది. ఒక రోజు ఇరగదీస్తాను” అని ప్రభాస్ అన్నాడు.

డైరెక్టర్ మారుతి, క్లైమ్యాక్స్‌పై..

ఇక డైరెక్టర్ మారుతి గురించి మాట్లాడుతూ.. అతని భుజంపై చేయి వేసి ఈ డార్లింగ్ 15 ఏళ్ల తర్వాత మంచి ఎంర్టైన్మెంట్ అందించాడు అని అన్నాడు. ఇక మూవీ క్లైమ్యాక్స్ గురించి చెబుతూ.. “మారుతి డార్లింగ్ అది పెన్నుతో రాశావా, మిషన్ గన్నుతో రాశావా.. క్లైమ్యాక్స్ చూసి మతిపోయింది. మాటలు రాలేదు. కానీ ఫైనల్ గా దానిని చూసి జడ్జ్ చేయాల్సింది మీరు” అని ప్రభాస్ చెప్పాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More