ప్రభాస్‌ను ఎన్నో ఏళ్లపాటు గుర్తు పెట్టుకుంటారు.. పాన్ ఇండియాకు అతని మరో కోణం తెలుస్తుంది: ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి
ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ను చాలా ఏళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారని, పాన్ ఇండియా ప్రేక్షకులకు అతనిలోని మరో కోణం తెలుస్తుందని అన్నాడు.
ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో ప్రభాస్ గెటప్, లుక్ ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూడని విధంగా ఉంటాయని, పాన్ ఇండియా ఆడియెన్స్ సర్ప్రైజ్ అవుతారని మారుతి హైప్ పెంచేశాడు.

ప్రభాస్ పాత్రపై మారుతి ఏమన్నాడంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'ది రాజా సాబ్' కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మారుతి ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశాడు.
ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే మాటలు మారుతి చెప్పాడు. "ప్రభాస్ గారిలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కానీ పాన్ ఇండియా ఆడియెన్స్ ఇప్పటివరకు ఆ కోణాన్ని చూడలేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక.. ప్రభాస్ గారిని ఈ సినిమా ద్వారా చాలా ఏళ్ల పాటు గుర్తుపెట్టుకుంటారు. ఆయన గెటప్ ఒక గ్రేట్ ఎపిసోడ్.. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది" అని మారుతి తెలిపాడు.
ప్రభాస్ స్వాగ్, మేకోవర్
ది రాజా సాబ్ మూవీ హారర్-కామెడీ జానర్ కావడంతో ప్రతిదీ కొత్తగా ఉంటుందని మారుతి అన్నాడు. "ప్రభాస్ గారి మేకప్, హెయిర్ స్టైల్, ఆయన మాట్లాడే తీరు.. అంతా కొత్తగా ఉంటుంది. ఆయనలో ఒక ఇన్నర్ స్వాగ్ ఉంటుంది. ఆయన నిలబడే తీరు, కుర్చీలో కూర్చునే విధానంలో కూడా ఆ స్వాగ్ కనిపిస్తుంది. మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని మారుతి హామీ ఇచ్చాడు.
'ది రాజా సాబ్' మూవీ విశేషాలు
ది రాజా సాబ్ మూవీ జనవరి 9న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. తమన్ మ్యూజిక్ అందించాడు.
తమ పూర్వీకుల ఆస్తిని అమ్ముకోవడానికి వచ్చిన ఒక వ్యక్తికి.. అక్కడ ఎదురయ్యే అతీంద్రియ శక్తుల అనుభవమే ఈ సినిమా కథ అని ప్రమోషనల్ వీడియోలు, ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) సాయంత్రం హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ లో మూవీ నుంచి ఏదైనా కొత్త ప్రమోషనల్ వీడియో వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. మరో ట్రైలర్ రావచ్చని భావిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


