రేపే ది రాజా సాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భైరవిగా మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రెండు వారాల ముందే నిర్వహిస్తున్నారు. రేపే అంటే శనివారం (డిసెంబర్ 27) ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Published on: Dec 26, 2025, 20:31:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ది రాజా సాబ్ సందడి రిలీజ్ కు రెండు వారాల ముందే మొదలు కానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను మాత్రం ఈ శనివారమే (డిసెంబర్ 27) నిర్వహిస్తుండటం విశేషం. అలాగే మూవీ నుంచి మాళవిక మోహనన్ పాత్ర భైరవి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

రేపే ది రాజా సాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భైరవిగా మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ రిలీజ్
రేపే ది రాజా సాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భైరవిగా మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ రిలీజ్

ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆశ్చర్యకరంగా రెండు వారాల ముందే నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది.

వేదిక వివరాలను తర్వాత అనౌన్స్ చేస్తామని మేకర్స్ చెప్పారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం.. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి అనే క్యాప్షన్ తో మేకర్స్ ఓ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈవెంట్ ను జాగ్రత్తగా నిర్వహించండి.. ఏదైనా జరిగితే మా డార్లింగ్ కు చెడ్డ పేరు వస్తుందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.

భైరవి లుక్ రిలీజ్

ఇక ది రాజా సాబ్ మూవీలో నటిస్తున్న మాళవిక మోహనన్ పాత్ర భైరవి లుక్ కూడా రిలీజ్ చేశారు. నల్ల చీరలో ఆమె కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని సెక్సీగా కనిపించింది. భైరవి.. పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్ అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ది రాజా సాబ్ మూవీ గురించి..

ది రాజా సాబ్ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా క్రిస్మస్ రోజు కూడా మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రాజే యువరాజే అనే సాంగ్ ప్రోమోను తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు.

మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీగా ఈ ది రాజా సాబ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సంక్రాంతికి రానున్న తొలి సినిమా ఇదే కాగా.. మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారీలాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More