సందీప్ రెడ్డి వంగాకు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రభాస్.. స్పిరిట్ కోసం వేచి చూడలేకపోతున్నానంటూ..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు బర్త్ డే విషెస్ చెప్పాడు ప్రభాస్. ఈ సందర్భంగా స్పిరిట్ మూవీ గురించి కూడా ప్రస్తావించాడు. ఇక ఇదే సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా సందీప్ కు విషెస్ చెబుతూ పోస్ట్ చేశాడు.

Published on: Dec 25, 2025, 19:19:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 44వ పుట్టినరోజు (డిసెంబర్ 25) సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అతని తర్వాతి సినిమా 'స్పిరిట్' (Spirit) హీరో రెబల్ స్టార్ ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ చేసిన విషెస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగాకు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రభాస్.. స్పిరిట్ కోసం వేచి చూడలేకపోతున్నానంటూ..
సందీప్ రెడ్డి వంగాకు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రభాస్.. స్పిరిట్ కోసం వేచి చూడలేకపోతున్నానంటూ..

సందీప్‌కు ప్రభాస్ విషెస్

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురువారం (డిసెంబర్ 25) 44వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతనితో సినిమా చేస్తున్న ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు.

సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్.. తన డైరెక్టర్ కోసం ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు. సెట్స్‌లో సందీప్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. "హ్యాపీ బర్త్‌డే బ్రో.. నువ్వు ఏం సృష్టిస్తున్నావో అందరూ ఎప్పుడెప్పుడు చూస్తారా అని నేను వెయిట్ చేస్తున్నా" అని రాసుకొచ్చాడు. అంటే 'స్పిరిట్' సినిమాతో సందీప్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది.

జీరో సెన్సార్‌షిప్

'స్పిరిట్'లో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తనదైన స్టైల్‌లో విషెస్ చెప్పారు.

"హ్యాపీ బర్త్‌డే బ్రదర్.. ఈ రోజు నీకు రా ఎమోషన్స్, జీరో సెన్సార్‌షిప్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నా. మా నాన్నగారికి (సురేష్ ఒబెరాయ్), నాకు నువ్వు ఇచ్చిన గౌరవానికి థ్యాంక్స్. నువ్వు మాకు డైరెక్టర్ కంటే ఎక్కువ" అని ట్వీట్ చేశాడు.

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ విశేషాలు

2017లో విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' తీసి ట్రెండ్ సెట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో 'కబీర్ సింగ్', రణబీర్ కపూర్‌తో 'యానిమల్' తీసి.. వైలెన్స్ అంటే ఏంటో చూపిస్తా అన్న మాటను నిలబెట్టుకున్నాడు. 'యానిమల్' విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్, తృప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు.. చైనీస్ (Mandarin), జపనీస్, కొరియన్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ బర్త్‌డే రోజున రిలీజ్ చేసిన 'సౌండ్ స్టోరీ'కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More