దురంధర్ కలెక్షన్లతో పోటీ-సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్-అక్కడ యానిమల్ రిలీజ్
బాక్సాఫీస్ దగ్గర దురంధర్ ఊచకోత కొనసాగుతోంది. ఆ మూవీ రూ.1000 కోట్ల వసూళ్లకు చేరువైంది. ఈ క్రమంలో యానిమల్ రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పుడు యానిమల్ ను మళ్లీ నిలబెట్టేలా సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు.
దురంధర్ తో కలెక్షన్ల పోరుకు సై అంటోంది యానిమల్ మూవీ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా కలెక్షన్లను దురంధర్ దాటేసింది. దీంతో దురంధర్ ను మళ్లీ వెనక్కి నెట్టేలా యానిమల్ డైరెక్టర్ సందీప్ పెద్ద ప్లాన్ వేశాడు. యానిమల్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు.

జపాన్ లో యానిమల్
అధికారిక ప్రకటన వచ్చేసింది! సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమా రెండేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈసారి ఈ చిత్రం జపాన్ లో మాత్రమే రిలీజ్ కానుంది. ఇటీవల కాలంలో భారతీయ సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో యానిమల్ ను అక్కడ రిలీజ్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంతో రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ జపాన్ లో భారీగా రిలీజ్ కానుంది. 2026, ఫిబ్రవరి 13న అక్కడి థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన భద్రకాళి ఫిల్మ్స్ ప్రకటించింది.
"కోనో ఒటోకో వా డరేనిమో టోమెరెనై" (ఈ వ్యక్తిని ఎవరూ ఆపలేరు). అత్యంత చర్చనీయాంశమైన, వివాదాస్పదమైన, మరపురాని సినిమాటిక్ అనుభవం జపాన్‌కు రానుంది. యానిమల్ ఫిబ్రవరి 13, 2026న జపాన్ థియేటర్లలో విడుదల అవుతుంది" అని పోస్టు చేశారు.
యానిమల్ కలెక్షన్లు
2023 డిసెంబర్ రిలీజైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. భారతదేశంలో రూ.553 కోట్లు నెట్ వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన 9వ భారతీయ చిత్రంగా నిలిచింది. కానీ ఈ రికార్డును ఇప్పుడు దురంధర్ బ్రేక్ చేసింది.
రూ.1000 కోట్ల దిశగా
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5, 2025న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ మూవీ బుధవారం (డిసెంబర్ 25) వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.935 కోట్ల గ్రాస్ సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది. ఇది రూ.1000 కోట్ల దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే యానిమల్ రూ.915 కోట్ల కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది దురంధర్.
యానిమల్ మళ్లీ
దురంధర్ దక్కించుకున్న స్థానాన్ని యానిమల్ తిరిగి సొంతం చేసుకోవాని చూస్తోంది. యానిమల్ నిర్మాతలు ఈ సినిమా జపాన్ బాక్సాఫీస్ వసూళ్లతో రూ.1000 కోట్ల మార్కును చేరుకుంటుందని ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో జపాన్‌లో భారతీయ చిత్రాలు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ అక్కడ 2.4 బిలియన్ యెన్ లు (రూ.150 కోట్లకు పైగా) వసూలు చేయగా, కేజీఎఫ్ చాప్టర్ 2 ఏమో 1.1 బిలియన్ యెన్ లు (రూ.70 కోట్లు) రాబట్టింది. యానిమల్ కూడా ఈ రెండు సినిమాల్లాగే జపాన్ లో మంచి ప్రదర్శన చేస్తే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


