సందీప్ రెడ్డి వంగా యానిమ‌ల్ ఔట్‌-ఆల్ టైమ్ టాప్ 10లోకి దురంధ‌ర్‌- టాప్ 2లో తెలుగు సినిమాలే

ర‌ణ్‌వీర్ సింగ్‌ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. ఈ సినిమా మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆల్ టైమ్ అత్యధిక కలెక్షన్ల ఇండియన్ సినిమాల్లో టాప్ 10లోకి అడుగుపెట్టింది. 

Published on: Dec 22, 2025, 10:36:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ రికార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఈ సినిమా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా దురంధర్ నిలిచింది. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్ జంటగా నటించారు.

దురంధర్ మూవీ పోస్టర్ లో ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్
దురంధర్ మూవీ పోస్టర్ లో ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్

దురంధర్ కలెక్షన్లు

దురంధర్ మూవీ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. ఈ స్పై థ్రిల్లర్ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచి బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. రికార్డులు బ్రేక్ చేస్తూనే సాగుతోంది. ఈ మూవీ తాజాగా భారీ రికార్డును బద్దలు కొట్టింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చింది దురంధర్.

యానిమల్ ను దాటి

ఇండియాలో టాప్ 10 వసూళ్లు సినిమాల్లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ పదో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ సినిమాను దాటి ర‌ణ్‌వీర్ సింగ్‌ దురంధర్ ఈ లిస్ట్ లోకి ఎంటరైంది. రూ.555.7 కోట్ల ఇండియన్ కలెక్షన్లతో అదరగొట్టింది. యానిమల్ వసూళ్లు రూ.553 కోట్లుగా ఉన్నాయి.

టాప్ 2లో తెలుగు సినిమాలు

ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో టాప్ 2లో తెలుగు చిత్రాల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి రెండు స్థానాల్లోనూ తెలుగు సినిమాలే ఉన్నాయి. టాప్ లో పుష్ప 2 ఉంది. దాని ఇండియన్ కలెక్షన్లు రూ.1234.1 కోట్లుగా ఉన్నాయి. రెండో స్థానంలో రాజమౌళి డైెరెక్షన్ లో వచ్చిన బాహుబలి 2 ఉంది. ఈ మూవీ వసూళ్లు రూ.1030.42 కోట్లుగా ఉన్నాయి.

RankMovie NameIndia Collection (In crore)
1Pushpa: The Rule – Part 2 (2024)1234.1
2Baahubali 2: The Conclusion (2017)1030.42
3KGF Chapter 2 (2022)859.7
4RRR (2022)782.2
5Kalki 2898 AD (2024)646.31
6Jawan (2023)640.25
7Kantara: A Legend Chapter-1 (2025)622.42
8Chhaava (2025)601.54
9Stree 2 (2024)597.99
10Dhurandhar (2025)555.7

2025లో మూడో సినిమా

2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో దురంధర్ మూడో స్థానానికి చేరుకుంది. కాంతార చాప్టర్ 1 రూ.622 కోట్లు, ఛావా రూ.601 కోట్లు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సినిమాలను కూడా దురంధర్ దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీ ర‌ణ్‌వీర్ సింగ్‌ దురంధర్ నిలిచే అవకాశముంది.

సందీప్ రెడ్డి వంగా రియాక్షన్

దురంధర్ మూవీపై సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించాడు. "ధురంధర్ ఎక్కువగా మాట్లాడని, పురుష వెన్నెముకను కలిగి ఉన్న వ్యక్తిలా తెరకెక్కింది. దురంధర్ టైటిల్ సరిపోతుంది ఎందుకంటే చిత్రం ఆధిపత్యం, తీవ్రతతో కదులుతుంది. సున్నా గందరగోళంతో చిత్రణ చాలా స్పష్టంగా ఉంది. సంగీతం, ప్రదర్శనలు, స్క్రీన్ ప్లే & దర్శకత్వం అగ్రస్థానంలో ఉన్నాయి. అక్షయ్ ఖన్నా సార్, ర‌ణ్‌వీర్ సింగ్‌ తమ పాత్రల్లో మాయమయ్యారు"అని సందీప్ పేర్కొన్నాడు.

అంతకుముందు రామ్ గోపాల్ వర్మ, కరణ్ జోహార్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి చిత్ర ప్రముఖులు కూడా దురంధర్ పై ప్రశంసలు కురిపించారు. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రలు పోషించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More