క్రేజీ బజ్.. తెలుగులోనూ దురంధర్ రిలీజ్.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్పై థ్రిల్లర్!

క్రేజీ బజ్ ఒకటి వైరల్ గా మారింది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న హిందీ సినిమా దురంధర్ తెలుగులోనూ రిలీజ్ కాబోతుందని తెలిసింది. ఈ సినిమా తెలుగు రిలీజ్ పై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 

Published on: Dec 15, 2025, 13:46:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా పేరు దురంధర్. ర‌ణ్‌వీర్‌ సింగ్ హీరోగా వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అదరగొడుతోంది. ఈ హిందీ సినిమా కొత్త కలెక్షన్ల రికార్డులు నమోదు చేస్తోంది. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.

దురంధర్ పోస్టర్ లో ర‌ణ్‌వీర్‌ సింగ్ (x/AdityaDharFilms)
దురంధర్ పోస్టర్ లో ర‌ణ్‌వీర్‌ సింగ్ (x/AdityaDharFilms)

తెలుగులో దురంధర్

దురంధర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ర‌ణ్‌వీర్‌ సింగ్ తో పాటు ఇతర కీలక నటుల యాక్టింగ్ కు సెల్యూట్ కొడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై మనసు పారేసుకుంటున్నారు. ఇక కలెక్షన్ల మోత మోగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారని టాక్.

రిలీజ్ డేట్

హిందీలో రిలీజైన సినిమా దురంధర్. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. కలెక్షన్లు దుమ్ము రేపుతోంది. ఈ మూవీపై ఇండియా సినీ లవర్స్ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు వాళ్లు కూడా ఈ సినిమా రివ్యూ, కలెక్షన్లపై ఓ కన్నేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దురంధర్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ పై రేపో మాపో క్లారిటీ రాబోతుందని తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో ఘన విజయం సాధించిన ఛావా సినిమాను కూడా ఇలాగే తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

దురంధర్ కలెక్షన్లు

డిసెంబర్ 5న రిలీజైన దురంధర్ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజైన తర్వాత కేవలం 10 రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్ల మార్కును అధిగమించింది దురంధర్ సినిమా. ఇదే ఊపు కొనసాగితే, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది.

రూ.59 కోట్లు

'దురంధర్' రెండో ఆదివారం ఏకంగా రూ. 59 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రెండో వారాంతపు దేశీయ వసూళ్లను రూ. 144.50 కోట్లతో ముగించింది. ఇది తొలి వారాంతపు కలెక్షన్లతో పోలిస్తే దాదాపు 40 శాతం అధికం కావడం గమనార్హం.

కేవలం పది రోజుల్లోనే దురంధర్ సినిమా భారతదేశంలో రూ. 351.75 కోట్ల నెట్, రూ. 422 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. ఇక తొలి వారంలో ఓవర్సీస్‌లో కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ మౌత్ టాక్ పవర్‌తో ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ అద్భుతంగా రాణించింది. ఈ సినిమాకు ఇండియాలో, బయట మంచి ఆదరణ కొనసాగుతోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీ తెలుగు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More