షారుక్ ఖాన్, అల్లు అర్జున్ సినిమాలు అవుట్- రణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ సునామీ- 10 రోజుల దురంధర్ కలెక్షన్స్!
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'దురంధర్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ. 500 కోట్ల మార్కును దాటేసింది. దాంతో షారుక్ ఖాన్, రజనీకాంత్, అల్లు అర్జున్ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్ అవుట్ అయిపోయాయి.
ప్రతి రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తూ, అంచనాలకు మించి దూసుకుపోతోంది 'దురంధర్'. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిందీ సినిమాల చరిత్రలోనే అత్యుత్తమ రెండో వారాంతపు వసూళ్లను నమోదు చేసింది.

500 కోట్లు మార్క్ దాటేసి
కేవలం 10 రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్ల మార్కును అధిగమించింది దురంధర్ సినిమా. ఇదే ఊపు కొనసాగితే, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది.
40 శాతం అధికంగా
'దురంధర్' రెండో ఆదివారం ఏకంగా రూ. 59 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రెండో వారాంతపు దేశీయ వసూళ్లను రూ. 144.50 కోట్లతో ముగించింది. ఇది తొలి వారాంతపు కలెక్షన్లతో పోలిస్తే దాదాపు 40 శాతం అధికం కావడం గమనార్హం.
దురంధర్ నెట్ అండ్ గ్రాస్ కలెక్షన్స్
కేవలం పది రోజుల్లోనే దురంధర్ సినిమా భారతదేశంలో రూ. 351.75 కోట్ల నెట్, రూ. 422 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. ఇక తొలి వారంలో ఓవర్సీస్‌లో కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ మౌత్ టాక్ పవర్‌తో ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ అద్భుతంగా రాణించింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ధురంధర్ మూవీ 10 రోజుల్లోనే ఓవర్సీస్ మార్కెట్‌లో 12 మిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. అందులో 4.5 మిలియన్ డాలర్లు ఒక్క రెండో వారంలోనే రావడం విశేషం. దీంతో ధురందర్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 530 కోట్లకు చేరుకున్నాయి.
ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు
ధురంధర్ సినిమా ఆదివారం (డిసెంబర్ 14) నాడు రూ. 500 కోట్ల మార్కును అధిగమించడమే కాకుండా షారుక్ ఖాన్, రజనీకాంత్, అల్లు అర్జున్ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను అవుట్ చేసేసింది.
షారుక్-రజనీ-బన్నీ
రజినీకాంత్ 'కూలీ' (రూ. 518 కోట్లు), షారుఖ్ ఖాన్ 'డుంకీ' (రూ. 470 కోట్లు), హృతిక్ రోషన్ 'వార్' (రూ. 449 కోట్లు), అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' (రూ. 365 కోట్లు) వంటి పెద్ద చిత్రాల ఫైనల్ గ్లోబల్ కలెక్షన్ల కంటే అధికంగా ధురంధర్ వసూళ్లు ఉండటం విశేషంగా మారింది.
టార్గెట్ సినిమాలు
ప్రస్తుతం 2025లో విడుదలైన చిత్రాలలో ధురంధర్ మూవీ కంటే ముందు కేవలం మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. 'కాంతార చాప్టర్ వన్' (రూ. 852 కోట్లు), 'ఛావా' (రూ. 808 కోట్లు), 'సైయారా' (రూ. 579 కోట్లు) సినిమాలను ధురందర్ టార్గెట్‌గా పెట్టుకుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


