రజినీకాంత్ 75వ బర్త్‌డే.. ఒకే ఓటీటీలోని సూపర్ స్టార్ 5 బెస్ట్ సినిమాలు.. స్క్రీన్‌పై మ్యాజిక్.. ఓ లుక్కేయండి
ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. ఆయన అలా స్టైల్ గా నడుచుకుంటూ వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. తన స్టైల్ తో, స్వాగ్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ 75వ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా ఒకే ఓటీటీలో ఉన్న ఆయన కెరీర్ లోని బెస్ట్ 5 సినిమాలను చూసేయండి.
సూపర్ స్టార్ రజినీకాంత్. స్టైల్ కు, స్వాగ్ కు, స్క్రీన్ పై యాక్టింగ్ కు ఆయన మారుపేరు. ఆయన్ని తెరపై చూసి నటన మీద ఇష్టం పెంచుకున్నవాళ్లు ఎంతో మంది. ఆయన పక్కన నిలబడాలని ప్రయత్నించే సెలబ్రిటీలు ఎందరో. అలాంటి తలైవా ఇవాళ (డిసెంబర్ 12) 75వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన 50 ఏళ్ల సినీ కెరీర్ లోని 5 ఉత్తమ సినిమాల ఓటీటీలపై ఓ లుక్కేయండి. ఇవన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.

బాషా
రజినీకాంత్ కెరీర్ లో ఓ టర్నింగ్ పాయింట్ బాషా మూవీ. అప్పట్లో అదో సంచలనం. అందులో రెండు యాంగిల్స్ ఉన్న పాత్రల్లో తలైవా అదరగొట్టారు. బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అని డైలాగ్ ఎవర్ గ్రీన్. ఈ సినిమా జనవరి 15, 1995లో రిలీజైంది. మాణిక్యం (గతంలో మాణిక్ బాషా) క్యారెక్టర్ లో సూపర్ స్టార్ యాక్టింగ్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ మూవీని ఓటీటీలో చూసేయండి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.
ముత్తు
రజినీకాంత్ సినిమా ముత్తుకు ఇప్పటికీ ఫ్యాన్స్ లో క్రేజ్ ఉంది. ఇందులోని సాంగ్స్, డైలాగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముత్తు సినిమా 1995, అక్టోబర్ 23న విడుదలైంది. ముత్తు (రజినీకాంత్), జమీందార్ (శరత్ బాబు) మధ్య బాండింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఈ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
చంద్రముఖి
ఇప్పటికీ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలకు ఓ ఉదాహరణగా చెప్పుకునే గొప్ప మూవీ చంద్రముఖి. ఇందులో డాక్టర్ శరవణన్ గా రజినీకాంత్ చేసే సందడి అదిరిపోయింది. ఇక చంద్రముఖి కోసం వేట, దెయ్యాన్ని వదలగొట్టే సీన్స్ మరో లెవల్. ఈ హారర్ మూవీ 2005లో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో చూడొచ్చు.
దళపతి
నిజమైన స్నేహానికి అర్థం చెప్పే మూవీ దళపతి. మహాభారతంలోని కర్ణుడు, దుర్యోధనుడు స్నేహం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దళపతి మూవీ 1991లో రిలీజైంది. ఇందులో రజినీకాంత్, మమ్ముట్టి కలిసి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఉంది.
శివాజి: ది బాస్
సమాజానికి సేవ చేయాలనే తపన ఎప్పుడూ రజినీకాంత్ కు ఉంది. తన సినిమాల ద్వారానూ ఆయన ఈ విషయాలను ఆడియన్స్ వరకూ తీసుకెళతారు. అలాంటి మూవీనే శివాజి: ది బాస్. 2007లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీలో ఇండియాలో ఉచిత విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో సాగే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటించారు తలైవా. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.
ఇవే కాకుండా కాలా, దర్బార్, జైలర్ లాంటి రజినీకాంత్ సినిమాలనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇంకెందుకు లేటు వెళ్లి ఒకసారి లుక్కేయండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


