రజనీకాంత్ 75వ బర్త్‌డే-50 ఏళ్ల సినీ కెరీర్-అత్యధిక కలెక్షన్ల టాప్ 5 సినిమాలు-ఈ ఓటీటీలో చూసేయండి
సామాన్యుడి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ పుట్టిన రోజు ఇవాళ. ఈ తలైవా శుక్రవారం 75వ జన్మదినం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీలపై ఓ లుక్కేయండి.
భారతీయ సినిమా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ తన యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇవాళ రజినీకాంత్ 75వ పుట్టిన రోజు. డిసెంబర్ 12న రజినీ అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా ఐఎండీబీ ప్రకారం రజినీకాంత్ టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.

రోబో 2.0
రోబో 2.0 మూవీ 2018లో రిలీజైంది. ఇది రోబోకు సీక్వెల్ గా వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. చిట్టి రోబో పాత్రలో రజినీకాంత్ తన నటనను మరోసారి ప్రదర్శించారు. 2.0 ముఖ్యంగా హిందీ, చైనీస్ మార్కెట్లలో అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.675 కోట్ల గ్రాస్ సాధించింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది.
జైలర్
2023లో వచ్చిన జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళంలో ఇండస్ట్రీ హిట్ గా అదరగొట్టింది. అన్ని కాలాలలోనూ అతిపెద్ద తమిళ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ సంగీతం, రజినీకాంత్ స్టైలిష్ నటన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. దీని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్ రూ.675 కోట్లు. జైలర్ సినిమా ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కూలీ
రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూలీ. ఇది 2025లో రిలీజైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రజనీ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అందించింది. కూలీ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.516.93 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
కబాలి
2016లో రిలీజైన రజినీకాంత్ మూవీ కబాలి. ఇది సీరియస్ గ్యాంగ్‌స్టర్ కథాంశం. ఎమోషనల్ గానూ అదరగొట్టింది. రీలీజ్ కు ముందే భారీ హైప్‌ను సృష్టించింది. రజినీకాంత్ "డాన్" లుక్, స్టైలిష్ కథనం దీనిని ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆగ్నేయాసియాలో ఒక హిట్ చిత్రంగా మార్చాయి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ.295 కోట్లుగా ఉంది. కబాలి సినిమా జియోహాట్ స్టార్, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో ఉంది.
రోబో (ఎంతిరాన్)
చిట్టి ది రోబోగా రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేశారు. 2010లో వచ్చిన రోబో భారతీయ సినిమాలో మొట్టమొదటి పెద్ద బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో ఒకటి. ఇందులో రజినీకాంత్ రెండు పాత్రలలో కనిపించాడు. ఒక శాస్త్రవేత్తగా, ఒక రోబోగా అదరగొట్టాడు. ఈ చిత్రం భారతీయ సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. రోబో ప్రపంచవ్యాప్తంగా రూ.290 కోట్లు సాధించింది. ఇది సన్ నెక్ట్స్, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


