ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన కాంత మూవీ.. దుల్కర్ సల్మాన్ అదిరే యాక్టింగ్.. మర్డర్ మిస్టరీ డ్రామా
దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ కాంత ఓటీీీటీలోకి వచ్చేసింది. డైరెక్టర్, హీరో మధ్య ఈగో బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మర్డర్ మిస్టరీ డ్రామా ఇది. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించాడు.
లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ కాంత ఓటీటీలో అడుగుపెట్టింది. ఇవాళ నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కాంత చిత్రంలో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే తదితరులు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ సాధించింది.

కాంత ఓటీటీ
ఓటీటీ లవర్స్ కు అదిరే న్యూస్. ఈ వీకెండ్ కు ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు సినిమాలు, సిరీస్ లు వచ్చేస్తున్నాయి. శుక్రవారం (డిసెంబర్12) చాలా ఓటీటీ రిలీజ్ లున్నాయి. ఇందులో ముఖ్యమైంది కాంత. ఈ మర్డర్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని చూడొచ్చు.
నెల రోజుల్లోనే
తమిళ పీరియాడిక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అయిన కాంత నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లో రిలీజైంది. తమిళ ఒరిజినల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సహా ఇతర భాషల్లోనూ రిలీజ్ అయింది. దీనికి సెల్వమణి సెల్వరాజ్ డైరెక్టర్. స్పిరిట్ మీడియా, వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత పొట్లూరి, జామ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కాంత మూవీ స్టోరీ
ఒక టాప్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ తీర్చిదిద్దిన హీరోకు మధ్య ఈగో ప్రధాన కథగా తీసుకుని తెరకెక్కించిన సినిమా కాంత. అయ్య (సముద్రఖని) తన తల్లి జీవితం ఆధారంగా ‘శాంత’ సినిమా తీయాలనుకుంటాడు. ఇందులో తన శిష్యుడైన టి.కె.మహదేవన్ (దుల్కర్) హీరో. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ కొన్నాళ్ల తర్వాత మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ క్లైమాక్స్ తో పాటు టైటిల్ ను మారుస్తాడు హీరో. శాంత కాస్తా కాంతగా మారుతుంది.
ఆ హత్యతో
సెట్ లో హీరో, డైరెక్టర్ కు పడదు. అయినా తన తల్లి కథను తెరపై చూసుకోవాలనే ఆశతో అయ్య సినిమాను తెరకెక్కిస్తాడు. హీరో, డైరెక్టర్ ను కలపాలని హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ హత్య జరుగుతుంది. సినిమాకు సంబంధించిన కీలక వ్యక్తి హత్యను ఎంక్వైరీ చేసేందుకు దేవరాజ్ (రానా) వస్తాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందా? అన్నది కాంత సినిమాలో చూడాల్సిందే.














