అల్లు అర్జున్‌తో కలిసి షెడ్డులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను, బన్నీ ఆ సలహా ఇచ్చినా నేను వినలేదు: హీరో, డైరెక్టర్ అనీష్

హీరోగా, డైరెక్టర్‌గా ఒకేసారి పరిచయం అవుతున్నారు అనీష్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లవ్ ఓటీపీ. విజయ్ ఎం రెడ్డి నిర్మించిన లవ్ ఓటీపీ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన లవ్ ఓటీపీ ట్రైలర్ లాంచ్‌లో అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి హీరో అనీష్ చెప్పుకొచ్చాడు.

Published on: Oct 23, 2025, 17:44:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా, దర్శకుడిగా ఒకేసారి పరిచయం అవుతున్నారు అనీష్. హీరోగా చేస్తూ డైరెక్టర్‌గా అనీష్ తెరకెక్కించిన రొమాంటిక్ సినిమా లవ్ ఓటీపీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్విక చేస్తుంది. నటుడు రాజీవ్ కనకాల, నాట్య రంగ, బాబా భాస్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

అల్లు అర్జున్‌తో కలిసి షెడ్డులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను, బన్నీ ఆ సలహా ఇచ్చినా నేను వినలేదు: హీరో, డైరెక్టర్ అనీష్
అల్లు అర్జున్‌తో కలిసి షెడ్డులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను, బన్నీ ఆ సలహా ఇచ్చినా నేను వినలేదు: హీరో, డైరెక్టర్ అనీష్

లవ్ ఓటీపీ రిలీజ్ డేట్

శ్రీమతి పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ ఎం రెడ్డి లవ్ ఓటీపీ సినిమాను నిర్మించారు. లవ్ ఓటీపీ మూవీ నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.

హీరో అనీష్ కామెంట్స్

ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 22) లవ్ ఓటీపీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన లవ్ ఓటీపీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోగా, డైరెక్టర్ అనీష్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

వైజాగ్ మూర్తి వద్ద యాక్టింగ్

హీరో, దర్శకుడు అనీష్ మాట్లాడుతూ .. "హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కంటుండేవాడిని. అదే విషయాన్ని మా నాన్న గారికి చెప్పాను. ఆయన సాయంతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. వైజాగ్ మూర్తి వద్ద యాక్టింగ్ నేర్చుకున్నాను" అని అన్నారు.

అల్లు అర్జున్‌తో డ్యాన్స్ ప్రాక్టీస్

"అల్లు అర్జున్ తో కలిసి షెడ్డులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. ‘నెలవంక’ మూవీ ఓపెనింగ్స్‌కి బన్నీ కూడా గెస్టుగా వచ్చారు. అయితే ప్రొడక్షన్‌లోకి వద్దు అని బన్నీ సలహా ఇచ్చినా నేను వినలేదు. ఆ మూవీ తరువాత నేను కన్నడకు వెళ్లిపోయాను. గౌతమ్ తిన్ననూరి కూడా మంచి స్నేహితుడు. ‘మళ్లీ రావా’ కూడా మిస్ అయింది" అని అనీష్ తెలిపారు.

ఇన్నేళ్లకు హీరోగా, దర్శకుడిగా

"ఎప్పటి నుంచో మళ్లీ తెలుగులోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాను. మళ్లీ ఇప్పుడు ఇలా ఇన్నేళ్లకు టెక్నీషియన్‌గా, దర్శకుడిగా, హీరోగా ఆడియెన్స్ ముందుకు వచ్చాను. ఇందులో మంచి కంటెంట్ ఉంటుంది. ఈ రోజు అదే మా ఈవెంట్‌కు గెస్ట్" అని అనీష్ పేర్కొన్నారు.

10 రోజుల ముందే చూపించాలని

"మేం కంటెంట్‌ను నమ్మి ఈ లవ్ ఓటీపీ మూవీని చేశాం. అందుకే పది రోజుల ముందే మీడియాకు ఈ మూవీని చూపించాలని అనుకున్నాం. విజయ్ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాజీవ్ కనకాల గారు ఈ మూవీని భుజానికెత్తుకుని ముందుకు తీసుకు వెళ్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను" అని అనీష్ తన స్పీచ్ ముగించారు.

తెలుగులో మొదటి చిత్రం

నటుడు నాట్య రంగ మాట్లాడుతూ .. "నాకు ‘లవ్ ఓటీపీ’ తెలుగులో మొదటి చిత్రం. నాకు అవకాశం ఇచ్చిన విజయ్, అనీష్ గారికి థాంక్స్. రాజీవ్ కనకాల వంటి సీనియర్లతో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో మంచి మ్యూజిక్, విజువల్స్ ఉంటాయి. నవంబర్ 14న మేం ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాం" అని తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More