ఒకే సినిమా.. రెండు వేర్వేరు రివ్యూలు.. విమర్శల నేపథ్యంలో అప్పుడే మాట మార్చేసిన హృతిక్ రోషన్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ దురంధర్ మూవీ విషయంలో గంటల్లోనే మాట మార్చేశాడు. మొదట సినిమాలోని పాలిటిక్స్ బాగాలేవంటూ ఇన్‌స్టా స్టోరీస్ లో చేసిన పోస్ట్ పై విమర్శలు రావడంతో గురువారం (డిసెంబర్ 11) ఉదయం ఎక్స్ లో మరో రివ్యూ పాజిటివ్ గా ఇచ్చాడు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 'ధురంధర్' సినిమాపై చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బుధవారం (డిసెంబర్ 10) సాయంత్రం సినిమాలోని పాలిటిక్స్ ను ప్రశ్నిస్తూ ఒక రివ్యూ పెట్టిన అతడు.. కొన్ని గంటల వ్యవధిలోనే మరో రివ్యూ పోస్ట్ చేశాడు. ఇందులో సినిమాను, నటీనటులను తెగ పొగడటంతో నెటిజన్లు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొదటి రివ్యూకి వచ్చిన విమర్శల వల్లే అతడు వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు.

హృతిక్ రోషన్ రెండో రివ్యూ ఇలా..
రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన దురంధర్ సినిమాపై హృతిక్ రోషన్ కొన్ని గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు రివ్యూలు ఇవ్వడం విశేషం. మొదటిదాంట్లోనూ సినిమా బాగున్నా పాలిటిక్స్ తో విభేదిస్తానని అన్నాడు. కానీ రెండో రివ్యూలో మాత్రం సినిమాను తెగ పొగిడేశాడు. మొదటి రివ్యూ పెట్టిన కొన్ని గంటలకే, హృతిక్ ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్‌లో నటీనటుల పనితీరును ప్రశంసిస్తూ ఇలా రాసుకొచ్చాడు.
"'ధురంధర్' ఇంకా నా మైండ్ నుంచి పోవడం లేదు. ఆదిత్య ధర్.. నువ్వు అద్భుతమైన మేకర్‌వి. రణ్‌వీర్ సింగ్.. సైలెంట్ నుంచి వైలెంట్‌గా మారే నీ జర్నీ అదుర్స్. అక్షయ్ ఖన్నా నాకు ఎప్పుడూ ఫేవరెట్టే అనేది ఎందుకో ఈ సినిమా నిరూపించింది. మాధవన్.. గ్రేస్, స్ట్రెంత్ అద్భుతం. ఇక రాకేష్ బేడీ.. మీరు చేసింది ఫినామినల్. మేకప్, ప్రోస్తటిక్స్ డిపార్ట్‌మెంట్‌కు హ్యాట్సాఫ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా" అని అన్నాడు.
అయోమయంలో అభిమానులు
హృతిక్ రోషన్ ఈ సినిమా రివ్యూ విషయంలో ఇంత ఆకస్మిక మార్పు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఇన్‌స్టాలో ఒకలా.. 48 గంటల తర్వాత ట్విటర్‌లో మరోలా.. బ్రో సినిమా అదిరింది అంటున్నావ్" అని ఒక వ్యక్తి అన్నారు.
"ట్విటర్, ఇన్‌స్టాలను ఇద్దరు వేర్వేరు హృతిక్‌లు నడుపుతున్నారా ఏంటి?" అని మరొకరు ప్రశ్నించారు. నిజానికి ఇన్‌స్టా స్టోరీస్ లోనూ ఈ రెండో రివ్యూను హృతిక్ పోస్ట్ చేశాడు. "నిన్న రాత్రి మీరు ప్రశ్నించిన ఆ పాలిటిక్స్ సంగతి ఏమైంది సార్?" అని ఒకరు ప్రశ్నించగా.. "హృతిక్ ఇన్‌స్టా చెక్ చేసుకుని.. అరె! ఇది నేను ఎప్పుడు రాశాను? అని ఆశ్చర్యపోతున్నాడేమో" అని మరొకరు జోక్ చేశారు.
మొదటి రివ్యూలో ఏమన్నాడంటే?
అంతకుముందు హృతిక్ తన ఇన్‌స్టా స్టోరీలో.. సినిమా స్టోరీటెల్లింగ్ బాగుందని చెబుతూనే.. తాను ఈ సినిమా రాజకీయాలతో విభేదించవచ్చు అని స్పష్టంగా రాశాడు. ఒక బాధ్యత గల పౌరుడిగా ఫిల్మ్ మేకర్లకు ఉండాల్సిన బాధ్యతలను గుర్తుచేశాడు. ఈ కామెంట్ చేసిన కాసేపటికే మళ్లీ సినిమాను ఆకాశానికెత్తేయడం నెటిజన్లకు అర్థం కావడం లేదు.
మరోవైపు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ 'ధురంధర్'లో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి స్టార్లు నటించారు. ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 230 కోట్లు దాటి వసూళ్లు రాబట్టింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


