దీపిక, రణ్‌వీర్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా.. తొలిసారి దువా ముఖాన్ని చూపించిన స్టార్ కపుల్

దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ జోడీ తొలిసారి తమ కూతురు దువా ముఖాన్ని పబ్లిక్‌గా రివీల్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఫ్యామిలీతో దిగిన ఫొటోలను దీపిక షేర్ చేయగా.. అందులో రెండు జుట్లు వేసుకొని ఆ పాప చాలా క్యూట్‌గా కనిపిస్తోంది.

Published on: Oct 22, 2025, 15:14:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ ఈసారి దీపావళిని మరింత ప్రత్యేకంగా మార్చారు. తొలిసారిగా తమ కూతురు దువా పదుకోన్ సింగ్ ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఎరుపు రంగు దుస్తులలో మెరిసిపోగా, లక్ష్మీ పూజలో దువా పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపిక, రణ్‌వీర్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా.. తొలిసారి దువా ముఖాన్ని చూపించిన స్టార్ కపుల్ (Photo: Instagram)
దీపిక, రణ్‌వీర్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా.. తొలిసారి దువా ముఖాన్ని చూపించిన స్టార్ కపుల్ (Photo: Instagram)

దువా పదుకోన్ క్యూట్ లుక్స్

దీపావళిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగు సినిమా సెలబ్రిటీలతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పండుగ వైబ్స్ ను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈసారి దీపావళిని బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ మరింత ప్రత్యేకంగా మార్చారు. తమ కూతురు దువా పదుకోన్ సింగ్ ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు.

దీపికా, రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ కలిసి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉమ్మడి పోస్ట్ పెట్టారు. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ పోస్ట్‌ను ప్రత్యేకంగా మార్చింది మాత్రం వారి క్యూట్ ఫ్యామిలీ పిక్చర్. వీరు ముగ్గురూ ఎరుపు పేస్టల్ రంగులలో ఒకే రకమైన దుస్తులు ధరించి ఉన్న కారౌసెల్ ఫోటోలను షేర్ చేశారు.

ఈ ఫొటోలలో ఈ పేరెంట్స్ తమ కూతురిని ఆప్యాయంగా చూస్తున్నారు. రెండు చిన్న పిలకలతో దువా ఒక్కో ఫోటోలో ఒక్కోలా క్యూట్ గా అల్లరి చేస్తూ మరింత ముద్దుగా కనిపించింది. ఇక చివరి ఫొటోలో దీపిక ఒడిలో దువా కూర్చుని లక్ష్మీ పూజ చేస్తున్న దృశ్యం ఉంది. దీపికా, తన కూతురి చేతులను పట్టుకుని, దేవతకు నమస్కరిస్తూ ఇచ్చిన పోజు ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఏడాది దాటిన దువా

తల్లిదండ్రులు దీపిక, రణ్‌వీర్ తమ కుమార్తె ముఖాన్ని ప్రపంచానికి చూపించడం ఇదే మొదటిసారి. వారి కూతురు దువా సెప్టెంబర్ 8, 2024న జన్మించింది. ఆమె పుట్టిన వెంటనే ఈ సెలబ్రిటీ కపుల్ మీడియాను ఆహ్వానించి ఒక అభ్యర్థన చేశారు. తమ కూతురిని ప్రపంచానికి పరిచయం చేయడానికి సరైన సమయం వచ్చే వరకు బహిరంగ ప్రదేశాల్లో దువా ఫోటోలను క్లిక్ చేయవద్దని కోరారు.

మీడియా కూడా వారి అభ్యర్థనను గౌరవించింది. అయితే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో ఒక అభిమాని దీపికా, దువా ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. నటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కూడా జరిగింది. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా దువా ముఖాన్ని అఫీషియల్‌గా చూపించడంతో ఫ్యాన్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More