ఫ్యామిలీతో అల్లు అర్జున్ దీపావళి సెలబ్రేషన్స్.. తన మరదలి ఫొటోను ఎందుకు కట్ చేశారని అడుగుతున్న ఫ్యాన్స్
అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. కొందరు ఫ్యాన్స్ తన మరదలి ఫొటోను మాత్రం ఎందుకు కనిపించకుండా చేశారంటూ అని అడగడం విశేషం.
అల్లు ఫ్యామిలీ ఈ దీపావళిని కలిసి ఆనందంగా జరుపుకుంది. అయితే అల్లు బాబీ, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి షేర్ చేసిన ఫోటోలలో అల్లు శిరీష్ కాబోయే భార్య నయనిక రెడ్డిని కావాలనే క్రాప్ చేశారని ఫ్యాన్స్ గమనించారు. దీంతో అసలు విషయం దాచిపెడుతున్నారా అని నెటిజన్లు కామెంట్ల సెక్షన్‌లో ప్రశ్నించారు.

అల్లు అర్జున్ దీపావళి సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ తోపాటు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మంచి ఔట్‌ఫిట్స్ ధరించి, టపాసులు కాల్చుతూ, ఇంట్లో చాలా సంతోషంగా గడిపారు. అల్లు బాబీ, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి వారి ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటోలలో ఒక కీలక వ్యక్తి కనిపించకపోవడాన్ని అభిమానులు గమనించారు. ఆ ముఖ్యమైన వ్యక్తి మరెవరో కాదు అల్లు శిరీష్ కాబోయే భార్య నయనిక రెడ్డి.
అల్లు బాబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో కుటుంబ పెద్దలు అల్లు అరవింద్, నిర్మల మధ్యలో కూర్చున్నారు. వారి చుట్టూ కుమారులు అర్జున్, బాబీ, శిరీష్ తో పాటు కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కనిపించారు.
స్నేహా రెడ్డి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే ఫోటోతో పాటు కొన్ని వీడియోలను షేర్ చేసింది. అంతేకాకుండా వారి పిల్లలు అయాన్, అర్హ టపాసులు కాల్చుతూ, ఇంటి చుట్టూ పెట్టిన దీపాలను చూస్తూ ఆనందిస్తున్న ఫోటోలను కూడా పంచుకుంది.
దీపావళి ఫోటోల నుంచి నయనిక రెడ్డి క్రాప్
అయితే ఈ రెండు అకౌంట్స్‌లో షేర్ అయిన ఫ్యామిలీ ఫోటోలను పరిశీలిస్తే.. శిరీష్ పక్కన కూర్చున్న అతని కాబోయే భార్య నయనిక కనిపించకుండా క్రాప్ చేశారు. ఇది గమనించిన అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఈ ఫోటోల కామెంట్స్ సెక్షన్‌లో ఎందుకు క్రాప్ చేశారంటూ ప్రశ్నలు వేశారు.
ఒక అభిమాని స్పందిస్తూ.. "నయనిక కనిపించడం లేదు" అని కామెంట్ చేయగా.. "శిరీష్ అన్న వైఫ్ కూడా పక్కనే ఉంది కదా" అని మరొకరు రాశారు. ఇంకొకరు సరదాగా "ఏదో దాస్తున్నారు" అని జోక్ చేశారు. మరొకరు స్పందిస్తూ.. "నయనిక రెడ్డి ఎక్కడ?" అని సూటిగా అడిగారు. "అల్లు శిరీష్ పక్కన ఎవరున్నారు, ఎందుకు క్రాప్ చేశారు?" అని మరొక అభిమాని ప్రశ్నించారు.
ఎవరీ నయనిక?
నయనిక గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ఆమె హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ వుమన్ అని మాత్రమే తెలుసు. గత అక్టోబర్ 1న శిరీష్ వారి నిశ్చితార్థాన్ని ప్రకటిస్తూ.. పారిస్‌లో ఒకరి చేతిని మరొకరు పట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "ఈరోజు మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా, నాకు చాలా ఇష్టమైన విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. నాకూ, నయనికకు ఎంగేజ్‌మెంట్ జరిగింది" అని రాశాడు.
తన పెళ్లి చూడాలని ఇటీవలే మరణించిన తన నానమ్మ కోరుకున్నారని కూడా ఈ సందర్భంగా శిరీష్ ప్రస్తావించాడు. అయితే ఇప్పటివరకు శిరీష్ ఆన్‌లైన్‌లో నయనిక ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. శిరీష్ చివరిగా 2024లో వచ్చిన బడ్డీ చిత్రంలో కనిపించాడు. తన తర్వాతి మూవీ గురించి చెప్పలేదు. అటు అల్లు అర్జున్ మాత్రం అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


