అల్లు అర్జున్-అట్లీ సినిమాపై హైప్ పెంచేసిన రణ్‌వీర్ సింగ్..ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ చూడని అద్భుతమంటూ సంచలన కామెంట్లు
అట్లీ దర్శకత్వంలో రాబోతున్న AA22 x A6 సినిమా గురించి రణ్‌వీర్ సింగ్ మాట్లాడాడు. షూటింగ్ సమయంలో తాను సెట్‌కు వెళ్లినప్పటి అనుభవాన్ని పంచుకున్నాడు. ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ చూడని అద్భుతాన్ని అట్లీ సృష్టిస్తున్నాడని పేర్కొన్నాడు.
జవాన్ లాంటి భారీ విజయం తర్వాత దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రం AA22 x A6 తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు దీపికా పదుకొణె భర్త, నటుడు రణ్‌వీర్ సింగ్ ఆ హైప్ ను మరింత పెంచేశాడు.

యాడ్ లాంచ్ ఈవెంట్
చింగ్స్ యాడ్ లాంచ్ ఈవెంట్‌లో రణ్‌వీర్.. అట్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. “జవాన్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుని, భారతదేశంలోనే అతిపెద్ద దర్శకుడిగా మారకముందే మెర్సల్ విడుదల తర్వాత ఆయనకు నేను మెసేజ్ చేశా. ‘సర్, మీ సినిమా నాకు చాలా ఇష్టం. మీరు ముంబైకి రావాలి, మనం కలిసి కొన్ని సినిమాలు చేద్దాం’ అని చెప్పా. అట్లీతో కలిసి పనిచేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇన్నేళ్లుగా ఆయన నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు” అని రణ్‌వీర్ సింగ్ అన్నాడు.
అదో అద్భుతం
అట్లీ రాబోయే చిత్రం AA22 x A6 గురించి కూడా రణ్‌వీర్ మాట్లాడుతూ.. “ఆయనతో, ఆయన సూపర్-డూపర్ అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. మిస్టర్ జి.కె. విష్ణు కెమెరా ముందు నిలబడటం గౌరవంగా, ఆనందంగా ఉంది. నా భార్య ఆయనతో షూటింగ్‌లో ఉన్నందున, నేను ఆయన ప్రస్తుత సినిమా సెట్‌కు వెళ్లాను. మీరు ఈ విషయం ఇంతకుముందే విని ఉండవచ్చు, కానీ నా మాటగా వినండి. ఇండియన్ సినిమాలో మీరు మునుపెన్నడూ చూడని, అనుభవించని ఒక అద్భుతాన్ని ఆయన సృష్టిస్తున్నారు” అని రణ్‌వీర్ పేర్కొన్నాడు.
హాలీవుడ్ టెక్నీషియన్లు
గతంలో ఇండియా టుడే డిజిటల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అట్లీ స్వయంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “చాలా కొత్తగా, ఆసక్తికరంగా, చూసేవారిని కట్టిపడేసేలా” ఒక సినిమాను తీస్తున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లతో కూడా ఈ దర్శకుడు పనిచేస్తున్నాడు. “హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నారు, ఇది చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్ అని వారు కూడా అంటున్నారు. దాన్నిబట్టి మేం నిజంగా ఏదో పెద్దది సృష్టిస్తున్నామని నమ్ముతున్నా” అని అట్లీ వివరించాడు.
150 కోట్లతో
ఫుడ్ బ్రాండ్ చింగ్స్ లేటెస్ట్ యాడ్ కు అట్లీ డైరెక్టర్. ఈ యాడ్ లో రణ్‌వీర్, శ్రీలీల, బాబీ డియోల్ నటించారు. ఈ యాడ్ కోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు పెట్టారని తెలిసింది. కాంతార చాప్టర్ 1, ఛావా, సైయారా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకంటే ఈ యాడ్ కు పెట్టిన బడ్జెట్ ఎక్కువ కావడం గమనార్హం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


