రెండోరోజు పడిపోయిన అఖండ 2 తాండవం కలెక్షన్స్- అయినా 50 కోట్ల వైపుకు బాలయ్య సినిమా- 2 రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

బాలకృష్ణ నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2 తాండవం' బాక్సాఫీస్ వద్ద తొలిరోజు అద్భుతమైన కలెక్షన్లు రాబట్టినప్పటికీ, రెండో రోజు కొద్దిగా తగ్గాయి. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం మొత్తం రూ. 46 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. రూ. 50 కోట్ల క్లబ్‌ వైపుగా ఈ సినిమా దూసుకెళ్తోంది.

Published on: Dec 14, 2025, 13:29:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'అఖండ 2: తాండవం' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇస్తోంది. తొలి రోజు అంచనాలకు మించిన వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు (శనివారం) మాత్రం కాస్త నెమ్మదించింది. అయినా, కేవలం రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌కు చేరువ కావడం విశేషం.

రెండోరోజు పడిపోయిన అఖండ 2 తాండవం కలెక్షన్స్- అయినా 50 కోట్ల వైపుకు బాలయ్య సినిమా- 2 రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
రెండోరోజు పడిపోయిన అఖండ 2 తాండవం కలెక్షన్స్- అయినా 50 కోట్ల వైపుకు బాలయ్య సినిమా- 2 రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

భారతదేశంలో

ఇండస్ట్రీ ట్రాకర్ 'సక్నిల్క్' నివేదిక ప్రకారం 'అఖండ 2' భారతదేశంలో రెండో రోజున అంటే శనివారం (డిసెంబర్ 13) రూ. 15.50 కోట్ల నికర వసూళ్లను (నెట్ కలెక్షన్స్) సాధించింది.

అఖండ 2 కలెక్షన్స్ పరిశీలిస్తే..

తొలి రోజు వసూళ్లు: రూ 22.5 కోట్లు (నెట్)

రెండో రోజు వసూళ్లు: రూ. 15.50 కోట్లు (నెట్)

అంటే, తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో సుమారు రూ. 7 కోట్ల తగ్గుదల నమోదైంది. ఇది దాదాపు 31.1% క్షీణత అని చెప్పాలి. ఇక అఖండ 2 విడుదలైన రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ. 46 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో అఖండ 2 ప్రీమియర్స్‌కు వచ్చిన రూ. 8 కోట్ల కలెక్షన్స్ కూడా ఉన్నాయి.

డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్

అయితే, ఈ గణాంకాలను చూస్తుంటే బాలకృష్ణ ఫాంటసీ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అఖండ 2 తాండవం రూ. 50 కోట్ల క్లబ్‌లోకి వేగంగా అడుగుపెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగు వెర్షన్ నుంచే అత్యధికంగా

అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు రూ. 22.5 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ నుంచే అత్యధికంగా రూ. 21.95 కోట్ల నికర వసూళ్లు వచ్చాయి.

హిందీ వెర్షన్: రూ. 1 లక్ష

కన్నడ డబ్బింగ్ వెర్షన్: రూ. 2 లక్షలు

తమిళ డబ్బింగ్ వెర్షన్: రూ. 43 లక్షలు

మలయాళం వెర్షన్: రూ. 1 లక్షగా ఉన్నాయి.

‘ధురందర్’తో పోటీ

అఖండ 2 సినిమా హిందీలో రణ్‌వీర్ సింగ్ 'ధురందర్' చిత్రంతో పోటీ పడుతోంది. అలాగే, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. రెండో రోజు (శనివారం) 'అఖండ 2' తెలుగు ఒరిజినల్ వెర్షన్ (2D) అత్యధికంగా 51.33% ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

ఆక్యుపెన్సీ

మార్నింగ్ షోలు: 28.86%

మధ్యాహ్నం షోలు: 50.14%

సాయంత్రం షోలు: 57.84%

నైట్ షోలు: 68.48%గా నమోదు అయింది.

తమిళం (2D)లో ఆక్యుపెన్సీ కాస్త తక్కువగా ఉంది. రెండో రోజు అఖండ 2 తమిళ వెర్షన్ మొత్తం 15.81% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ 2 సినిమాలో బాలకృష్ణతోపాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా నటించారు.

మున్నీ పాత్రతో

సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయిజాన్'లో మున్నీ పాత్రతో ప్రసిద్ధి చెందిన హర్షాలి మల్హోత్రా అఖండ 2 చిత్రంలో కీలక పాత్ర పోషించింది. బాల నటిగా అరంగేట్రం చేసిన తర్వాత ఆమె నటించిన మొదటి ప్రాజెక్ట్ ఇదే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More