ఓటీటీలోకి నిన్న రిలీజైన అఖండ 2- బాలకృష్ణ, బోయపాటి నాలుగో సినిమాకు షాకింగ్ టాక్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అఖండ 2 తాండవం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తిగా మారిపోయాయి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమా అఖండ 2 డిసెంబర్ 13న విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు షాకింగ్ టాక్ చోటు చేసుకున్న నేపథ్యంలో అఖండ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదేనంటూ టాక్ నడుస్తోంది.

Published on: Dec 13, 2025, 12:56:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలపై ఎల్లప్పుడు అమితమైన ఆసక్తి నెలకొంటుంది. అందులోనూ కొత్తగా థియేటర్లలో విడుదలైన సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తెలుసుకోవాలని విడుదలైన రోజు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియెన్స్. ఈ క్రమంలో థియేట్రికల్ రిలీజ్ రోజు నుంచే సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌‌ఫామ్స్ ఏంటనేది తెలిసిపోతుంది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన అఖండ 2- బాలకృష్ణ, బోయపాటి నాలుగో సినిమాకు షాకింగ్ టాక్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన అఖండ 2- బాలకృష్ణ, బోయపాటి నాలుగో సినిమాకు షాకింగ్ టాక్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్

ఈ నేపథ్యంలో ఇలాంటి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ నందమూరి నటసింహం బాలకృష్ణ లేటేస్ట్ మూవీపై ఉంది. ఆ సినిమానే అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే అఖండ 2 తాండవం. మాస్ డైరెక్టర్ బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమా ఇది.

ఆలస్యంగా థియేటర్లలోకి

సింహా, లెజెండ్, అఖండ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ వారం రోజులు ఆలస్యంగా శుక్రవారం (డిసెంబర్ 12) అంటే నిన్న థియేటర్లలో విడుదలైంది అఖండ 2 తాండవం సినిమా.

నార్త్‌లో మాత్రం మరోలా

అయితే, అఖండ 2 సినిమాకు షాకింగ్ టాక్ వస్తోంది. తెలుగులో బాలకృష్ణ తాండవానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలే అన్నట్లుగా ఉంది. కానీ, నార్త్‌లో మాత్రం అఖండ 2పై రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది. అఖండ 2ని పేలవమైన సినిమాగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

అఖండ 2 కలెక్షన్స్

ఇలా షాకింట్ టాక్ నడుమ కూడా తొలి రోజున అఖండ 2 అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో రూ. 30 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్‌ను అఖండ 2 తాండవం సినిమా రాబట్టింది. ఈ నేపథ్యంలో అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. అఖండ 2 ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా టాక్ నడుస్తోంది.

అఖండ 2 ఓటీటీ రైట్స్ ధర

డిజిటల్ స్ట్రీమింగ్‌లలో దిగ్గజ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 80 కోట్లు వెచ్చించి అఖండ 2 తాండవం ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే, థియేటర్లలో విడుదలైన నెల రోజుల గ్యాప్‌లోనే అఖండ 2 ఓటీటీ రిలీజ్ చేయాలని మూవీ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌తో నెట్‌ఫ్లిక్స్ డీల్ కూడా కుదుర్చుకున్నట్లు టాక్.

సంక్రాంతి సందర్భంగా

ఈ లెక్కన జనవరిలో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లోనే అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో అఖండ 2 తాండవం ఓటీటీ రిలీజ్ కానుందనే మరో వార్త చక్కర్లు కొడుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లోనే అఖండ 2 తాండవం

ఇలా థియేటర్లలో నిన్న రిలీజైన అఖండ 2 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రీమియర్ కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అఖండ 2 తాండవం సినిమాలో బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. హీరో ఆది పినిశెట్టి విలన్‌గా చేశాడు. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా అఖండ 2తోనే తెలుగులో నటిగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More