ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మర్డర్ మిస్టరీ- రియల్ ఇన్సిడెంట్స్‌తో అర్జున్, ఐశ్వర్య రాజేష్ థ్రిల్లర్- 8 రేటింగ్- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తీయావర్ కులైగల్ నడుంగ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.
ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలపై సినీ లవర్స్ అమితమైన ఆసక్తి చూపిస్తుంటారు. వారి అభిరుచికి తగినట్లుగానే ఓటీటీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ ప్రతి వారం రిలీజ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓటీటీలోకి సరికొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్
ఆ సినిమానే తీయావర్ కులైగల్ నడుంగ (Theeyavar Kulaigal Nadunga). యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. 'తీయావర్ కులైగల్ నడుంగ' థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుని ఓటీటీలోకి వచ్చేసింది.
ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ
విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్య చుట్టూ తిరిగే ఈ ఇంటెన్స్ మర్డర్ మిస్టరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎంతో అనుభవం గల ఇన్‌స్పెక్టర్ మగుడపాటి పాత్రలో అర్జున్ సర్జా ఆకట్టుకున్నారు. క్రైమ్, మర్డర్, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, లవ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
8 ఐఎమ్‌డీబీ రేటింగ్
నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన తీయావర్ కులైగల్ నడుంగ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8 రేటింగ్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను తెలుగులో మఫ్టీ పోలీస్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. కానీ, అంతగా రెస్పాన్స్ రాలేదు.
తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీ
తాజాగా ఇవాళ తమిళంలో మాత్రం తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్ట్స్‌లో తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సన్ నెక్ట్స్‌లో ప్రస్తుతం తమిళంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీ రిలీజ్ అయింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.
తీయావర్ కులైగల్ నడుంగ నటీనటులు
కాగా, తీయావర్ కులైగల్ నడుంగ సినిమాకు దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్‌తోపాటు ప్రవీణ్ రాజా, అభిరామి వెంకటాచలం, అనికా రాధాకృష్ణన్, రామ్ కుమార్ గణేషన్, వేల రామమూర్తి, ప్రాంక్‌స్టార్ రాహుల్, తంగుదురై తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా
అయితే, తీయావర్ కులైగల్ నడుంగ సినిమాను రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన హత్యా నేరం చుట్టూ కథ నడుస్తుంది. ఒక అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు.
ట్విస్టులు
ఈ కేసు విచారణ బాధ్యతలను ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జా) తీసుకుంటారు. అయితే, అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా ఉంటారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నారా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటీ? అనేది తెలియాలంటే తీయావర్ కులైగల్ నడుంగ సినిమా చూడాల్సిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


