ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- తల్లీకూతురి హత్య- 4 భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా తెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 12ఏ రైల్వే కాలనీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు పొలిమేర సినిమా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం. మరి 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Dec 11, 2025, 14:16:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీల్లో సినిమాలు అడుగుపెడుతుంటాయి. అయితే, ఈ ఓటీటీ రిలీజెస్ కొన్నిసార్లు అనౌన్స్‌మెంట్లతో, మంచి బజ్ క్రియేట్ చేస్తూ జరిగితే మరికొన్ని సార్లు చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి.

ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- తల్లీకూతురి హత్య- 4 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చిన తెలుగు హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- తల్లీకూతురి హత్య- 4 భాషల్లో స్ట్రీమింగ్!

సీరియస్ రోల్స్‌తో కూడా

అలా ఇవాళ (డిసెంబర్ 11) ఓటీటీలోకి సడెన్‌గా ఓ తెలుగు మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే 12ఏ రైల్వే కాలనీ. కామెడీ సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అల్లరి నరేష్ సీరియస్ రోల్స్‌తో కూడా మెప్పించాడు. అయితే, గత కొంత కాలంగా అల్లరి నరేష్ సినిమాలు వర్కౌట్ కావట్లేదు.

హారర్ క్రైమ్ థ్రిల్లర్‌గా

నాంది తర్వాత అల్లరి నరేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతంగా సక్సెస్ కావట్లేదు. అందులో ఒక సినిమానే 12ఏ రైల్వే కాలనీ. తెలుగులో హారర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 12ఏ రైల్వే కాలనీ సినిమాలో హీరోయిన్‌గా పొలిమేర బ్యూటి కామాక్షి భాస్కర్ల చేసింది. అలాగే, ఈ మూవీకి పొలిమేర చిత్రాల దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథ అందించడం విశేషం.

12ఏ రైల్వే కాలనీ నటీనటులు

12ఏ రైల్వే కాలనీ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా రూపొందించిన 12ఏ రైల్వే కాలనీ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు సాయి కుమార్, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, హర్ష చెముడు, గెటప్ శ్రీను, సద్దాం తదితరులు కీలక పాత్రలు పోషించారు.

12ఏ రైల్వే కాలనీ రివ్యూస్

ట్రైలర్, టీజర్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన 12ఏ రైల్వే కాలనీ థియేటర్లలో నవంబర్ 21న విడుదలైంది. అయితే, ఊహించినంత స్థాయిలో సినిమాకు ఆదరణ దక్కలేదు. 12ఏ రైల్వే కాలనీ రివ్యూస్ మిక్స్‌డ్‌గా వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్‌గా 12ఏ రైల్వే కాలనీ నిలిచింది.

ఓటీటీలోకి సడెన్‌గా

ఇలాంటి 12ఏ రైల్వే కాలనీ ఓటీటీలో ఇవాళ సడెన్‌గా ప్రత్యక్షమైంది. ఎలాంటి ప్రకనటన లేకుండా 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

తల్లీకూతురు హత్య నేపథ్యంలో

సుమారు 2 గంటల ఐదు నిమిషాల రన్‌టైమ్‌తో తెరకెక్కిన 12ఏ రైల్వే కాలనీ సినిమా తల్లికూతురు జంట హత్యల నేపథ్యంలో సాగుతుంది. ఆ హత్య ఎవరు? ఎందుకు చేశారు? హీరోకు హీరోయిన్ దెయ్యమై ఎందుకు కనిపించింది? హీరో ఏం చేశాడు? జంట హత్యల కేసును ఎలా చేధించాడు? రాజకీయ అంశాలు ఎలా ముడిపడ్డాయి? వంటి ఎలిమెంట్స్‌తో 12ఏ రైల్వే కాలనీ మూవీ ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

హారర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, సస్పెన్స్, రొమాంటిక్, కామెడీ అంశాలతో తెరకెక్కిన 12ఏ రైల్వే కాలనీ సినిమాను థియేటర్లలో చూడని వారు ఎంచక్కా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వీక్షించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More