పదిలో 8 మందికి పక్కవారి లైఫ్ తెలుసుకోవాలనే కుతుహలం ఉంటుంది, దానిపైనే ఈ ఓటీటీ సిరీస్: డైరెక్టర్ స్వాతి ప్రకాష్ కామెంట్స్
వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ జంటగా నటించిన లేటెస్ట్ సైకో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ నయనం. ఈ నయనం వెబ్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 19 నుంచి నయనం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్వాతి ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్నఓటీటీ సంస్థల్లో జీ5 ఒకటి. ఇండియాలో అతిపెద్దదైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా అవతరిస్తోన్న జీ 5 మరోసారి తనదైన శైలిలో విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించనుంది.

సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్
అదే ‘నయనం’. హీరో వరుణ్ సందేశ్, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ నయనం ఓటీటీ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు.
నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ఈ ఒరిజినల్ సిరీస్ నయనం జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నయనం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ స్వాతి ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ ప్లేస్ ఓ డ్రీమ్
డైరెక్టర్ స్వాతి ప్రకాష్ మాట్లాడుతూ.. "అనూరాధ గారికి, జీ5కి ముందు థాంక్స్. ప్రతి డెబ్యూ డైరెక్టర్‌కి ఈ ప్లేస్ ఓ డ్రీమ్. నా డ్రీమ్‌ను నిజం చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. షోయబ్ నా డ్రీమ్‌ను విజువల్‌గా చూశారు. అజయ్ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చి ఎన్‌హెన్స్ చేశారు" అని అన్నారు.
పక్కవారి లైఫ్‌లో
"ఈ పాయింట్‌ను ముందు నమ్మింది సాయి తేజ గారు. నాతో పాటు ట్రావెల్ అవుతూ ఓ షేప్ తీసుకొచ్చారు. ఆయనకు థాంక్స్. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇచ్చిన కిరణ్మయి గారికి థాంక్స్. పది మందిలో ఎడెనిమిది మంది పక్కవారి లైఫ్‌లో ఏం జరుగుతందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ ఓటీటీ సిరీస్" అని దర్శకురాలు స్వాత ప్రకాష్ తెలిపారు.
ప్లానింగ్ ప్రకారం
"సాధిక గారికి స్పెషల్ థాంక్స్. సాగర్ గారు ప్లానింగ్ ప్రకారం సపోర్ట్ చేశారు. రజినీ మేడమ్ గారు డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మి చాన్స్ ఇచ్చారు. కథ విని ఒప్పుకున్న వరుణ్ సందేశ్ గారికి థాంక్స్" అని స్వాత ప్రకాష్ పేర్కొన్నారు.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
"మా కష్టానికి యూనివర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 19న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవనున్న నయనం సిరీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని చూడండి" అని నయనం ఓటీటీ సిరీస్ డైరెక్టర్ స్వాతి ప్రకాష్ చెప్పుకొచ్చారు.
జర్నీలో భాగం కావడం
ఇదే ఈవెంట్‌లో సినిమాటోగ్రాఫర్ షోయబ్ సిద్ధికీ మాట్లాడుతూ.. "ఈ జర్నీలో భాగం కావటానికి ఎస్ఆర్‌టీ టీమ్, సాధిక, స్వాతి గారు అందరూ ఎంతో హెల్ప్ చేశారు. విజువల్స్ మెప్పిస్తాయి. డిసెంబర్ 19న నయనం మెప్పిస్తుంది" అని అన్నారు.
బ్యూటిఫుల్‌గా జరుగుతుంది
అలాగే, ఎడిటర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో నన్ను పార్ట్ చేసిన సాధికకు థాంక్స్. ప్రాజెక్ట్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


