నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని 6 అప్‌కమింగ్ సినిమాలు- వచ్చే వారమే స్ట్రీమింగ్-బోల్డ్ నుంచి థ్రిల్లర్ వరకు!

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో వచ్చేవారం నుంచి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఏమాత్రం మిస్ అవ్వకూడని 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. బోల్డ్ నుంచి థ్రిల్లర్ వరకు అన్ని జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్ అప్‌కమింగ్ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Dec 7, 2025, 12:49:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో క్రేజీ అప్‌కమింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అయితే, వాటిలో అస్సలు మిస్ అవ్వకూడని ఆరు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. బోల్డ్ నుంచి థ్రిల్లర్ వరకు మిస్ అవ్వకూడని ఆ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని 6 అప్‌కమింగ్ సినిమాలు- వచ్చే వారమే స్ట్రీమింగ్-బోల్డ్ నుంచి థ్రిల్లర్ వరకు!
నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని 6 అప్‌కమింగ్ సినిమాలు- వచ్చే వారమే స్ట్రీమింగ్-బోల్డ్ నుంచి థ్రిల్లర్ వరకు!

ది యాక్సిడెంట్ 2 ఓటీటీ

థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన సిరీస్ ది యాక్సిడెంట్. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పడు సీజన్ 2 వస్తోంది. ఓ కుటుంబం చుట్టూ సాగే ఈ సిరీస్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 10 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ది ఫేక్‌న్యాపింగ్ ఓటీటీ

సౌది అరేబియన్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ది ఫేక్‌న్యాపింగ్. అప్పుల్లో కూరుకుపోయిన తండ్రీ, కొడుకు దాని నుంచి తప్పించుకునేందుకు అద్భుతమైన ప్లాన్ వేస్తారు. కొడుకు తన సొంత తండ్రిని కిడ్నాప్ చేసినట్లు నటిస్తాడు. మరి వారి ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేదే స్టోరీ. ఈ సినిమా డిసెంబర్ 11న ఓటీటీ రిలీజ్ కానుంది.

మ్యాన్ వర్సెస్ బేబీ ఓటీటీ

బ్రిటీష్ కామెడీ వెబ్ సిరీస్‌గా రూపొందింది మ్యాన్ వర్సెస్ బేబీ. ఈ సిరీస్‌లో హీరో హౌస్ కీపింగ్ అనుభవం ఎలా ఉంటుంది, పిల్లలతో ఎలా ఇబ్బందులు పడ్డాడు? వంటి అంశాలతో సాగే మ్యాన్ వర్సెస్ బేబీ డిసెంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.

ది టౌన్ ఓటీటీ

ఇద్దరు అన్నదమ్ములు, వారి స్నేహితులకు డబ్బు చాలా అవసరం పడుతుంది. ఈ క్రమంలో వారికి దొంగలించిన నాలుగు డబ్బు సంచులు దొరుకుతాయి. ఆ తర్వాత వారి స్నేహం, సంబంధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనే కథతో తెరకెక్కిందే ది టౌన్. మనీ హీస్ట్ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన ది టౌన్ డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ 2 ఓటీటీ

యాక్షన్, సస్పెన్స్, శృంగారం వంటి అంశాలతో తెరకెక్కిన తైవానీస్ సిరీస్ హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్. బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ మూడు కోణాలతో రూపొందింది. ఈ సిరీస్ రెండో సీజన్ డిసెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుంది.

సిటీ ఆఫ్ షాడోస్ ఓటీటీ

మిస్టరీ సినిమాలు చూడాలనుకుంటే ఈ సినిమా వారి కోసమే. బార్సిలోనాలోని ఓ ప్రసిద్ధ భవనంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహం దొరుకుతుంది. ఆ హంతకుడుని పట్టుకునేందుకు చేసే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More