దురంధర్ సంచలనం- 500 కోట్ల వైపు యాక్షన్ థ్రిల్లర్- రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో రెండో బిగ్గెస్ట్ హిట్- సింబా రికార్డ్ బద్దలు

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీస్‌ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఈ యాక్షన్ థ్రిల్లర్ స్థిరంగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుంది. బ్లాక్‌బస్టర్ సినిమా 'సింబా' లైఫ్‌టైమ్ కలెక్షన్లను 'ధురంధర్' ఇప్పుడు అధిగమించింది.

Published on: Dec 14, 2025, 16:10:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీర రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం రణ్‌వీర్ సింగ్ బ్లాక్‌ బస్టర్ హిట్ ‘సింబా’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను బద్దలుకొట్టింది.

దురంధర్ సంచలనం- 500 కోట్ల వైపు యాక్షన్ థ్రిల్లర్- రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో రెండో బిగ్గెస్ట్ హిట్- సింబా రికార్డ్ బద్దలు
దురంధర్ సంచలనం- 500 కోట్ల వైపు యాక్షన్ థ్రిల్లర్- రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో రెండో బిగ్గెస్ట్ హిట్- సింబా రికార్డ్ బద్దలు

ధురంధర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

దురంధర్ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 446.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ధురంధర్ సినిమా ప్రస్తుతం రూ. 500 కోట్ల మార్క్‌ వైపునకు దూసుకుపోతోంది. అంతేకాకుండా త్వరలోనే రజనీకాంత్ 'కూలీ (రూ. 518 కోట్లు)', సూపర్ హిట్ 'సయ్యారా (రూ. 569.75 కోట్లు)' చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.

అత్యుత్తమ కలెక్షన్స్

సక్నిల్క్ (Sacnilk) నివేదికల ప్రకారం 'ధురంధర్' ఇండియాలో రెండో శుక్రవారం, శనివారం అత్యుత్తమ కలెక్షన్లను నమోదు చేసింది. రెండో శుక్రవారం (డిసెంబర్ 12) ధురంధర్ సినిమాకు రూ. 32.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, రెండో శనివారం అంటే డిసెంబర్ 13న ఇండియాలో ధురంధర్ మూవీ రూ. 53 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.

9 రోజుల్లో

ఈ సినిమా విడుదలైన తర్వాత ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లలో ఈ రెండు రోజులు అత్యధికం కావడం విశేషం. ఇకపోతే ధురంధర్ సినిమా 9 రోజుల్లో ఇండియాలో రూ. 292.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే, ఇండియా గ్రాస్ రూ. 351.25 కోట్లుగా ఉంది.

రెండో బిగ్గెస్ట్ హిట్

అలాగే, ఓవర్సీస్‌లో రూ. 95 కోట్ల వరకు కొల్లగొట్టింది ధురంధర్ సినిమా. వీటితోపాటు వరల్డ్ వైడ్‌గా 9 రోజుల్లో ధురంధర్ కలెక్షన్స్ రూ. 446.25 కోట్లకు చేరుకున్నాయి. ఈ అద్భుతమైన వసూళ్లతో 'ధురంధర్' సినిమా రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

సింబా లైఫ్‌టైమ్ కలెక్షన్స్ అవుట్

ఇందులో 'పద్మావత్' (రూ. 585 కోట్లు) ఇంకా అగ్రస్థానంలో ఉంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే 'సింబా' లైఫ్‌టైమ్ కలెక్షన్స్ (రూ. 390 కోట్లు)ను 'ధురంధర్' దాటేసింది. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ. 500 కోట్ల మార్క్‌కు దగ్గరవుతోంది.

ధురంధర్ నటీనటులు

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తోపాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు రాకేశ్ బేడీ, సారా అర్జున్, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More