ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇది.. రూ.50 లక్షల బడ్జెట్.. రూ.75 కోట్ల వసూళ్లు.. కాంతార, సయ్యారా, ఛావాలను మించి..

ఈ ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఏదో తెలుసా? ఈ మూవీ బడ్జెట్ కంటే ఏకంగా 150 రెట్లు ఎక్కువ వసూలు చేయడం విశేషం. రూ.50 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిన్న గుజరాతీ మూవీ రూ.75 కోట్లు వసూలు చేసింది. ఇంకా దూసుకెళ్తూనే ఉంది.

Published on: Nov 26, 2025, 22:00:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది ఇండియాలో కాంతార: ఛాప్టర్ 1, ఛావా, సయ్యారాలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. వందల కోట్లు వసూలు చేశాయి. కానీ వీటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభాలతో సంచలనం సృష్టించింది ఓ చిన్న గుజరాతీ మూవీ. ఈ సినిమా పేరు లాలో: కృష్ణ సదా సహాయతే. ఈ మూవీ గురించి తెలుసుకోండి.

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇది.. రూ.50 లక్షల బడ్జెట్.. రూ.75 కోట్ల వసూళ్లు.. కాంతార, సయ్యారా, ఛావాలను మించి..
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇది.. రూ.50 లక్షల బడ్జెట్.. రూ.75 కోట్ల వసూళ్లు.. కాంతార, సయ్యారా, ఛావాలను మించి..

అసలేంటీ మూవీ?

1975లో 'షోలే' థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలుసు కదా. దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. అయినప్పటికీ ఆ సమయంలో విడుదలైన ఓ తక్కువ బడ్జెట్ భక్తి సినిమా 'జై సంతోషి మా' కొన్ని ప్రాంతాల్లో 'షోలే' కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. 'జై సంతోషి మా' మూవీ 100 రెట్లకు పైగా లాభాలు ఆర్జించి, భారతీయ సినిమా చరిత్రలో ఒక కేస్ స్టడీగా మారింది.

దాదాపు అరవై ఏళ్లలో ఏ సినిమా కూడా ఆ రికార్డును అధిగమించలేదు. అయితే ఈ ఏడాది ఎలాంటి సూపర్ స్టార్స్ లేని ఒక సాదాసీదా గుజరాతీ మూవీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ సినిమా 150 రెట్లకు పైగా లాభాలను నమోదు చేసి, ఈ ఏడాదిలో అత్యధిక లాభాలను ఆర్జించిన మూవీగా నిలిచింది.

రూ.50 లక్షల బడ్జెట్‌.. రూ.75 కోట్ల వసూళ్లు

అక్టోబర్‌లో విడుదలైన గుజరాతీ మూవీ 'లాలో: కృష్ణ సదా సహాయతే' (Laalo: Krishna Sada Sahaayate) ఈ ఏడాది అతిపెద్ద థియేట్రికల్ సక్సెస్ స్టోరీలలో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో రూపొందించిన ఈ భక్తి ప్రధాన మూవీ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడిపై ఏకంగా 150 రెట్లు రాబడిని అందించింది. దీంతో ఇది ఈ సంవత్సరంలో అత్యధిక లాభదాయకమైన భారతీయ చిత్రంగా నిలిచింది.

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడు సినిమాలు కూడా లాభం విషయంలో దీనికి సాటి రాలేకపోయాయి. కాంతార: ఛాప్టర్ వన్ రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా.. రూ.850 కోట్లు వసూలు చేసింది. అంటే 7 రెట్లు లాభం.

ఇక ఛావా మూవీని రూ.90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తే.. రూ.808 కోట్లు వసూలు చేసింది. అంటే సుమారు 9 రెట్లు లాభం. సయ్యారా రూ.45 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన సినిమా కాగా.. రూ.500 కోట్లకుపైగా అంటే 13 రెట్లు లాభం ఆర్జించింది.

'లాలో: కృష్ణ సదా సహాయతే' గురించి

అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన 'లాలో' ఒక రిక్షా పుల్లర్ కథ. ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకున్న ఈ డ్రైవర్.. గతంలోని బాధలను తలుచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అతనికి కనిపిస్తూ ఉంటాడు. అలా ఓ కొత్త జీవితం వైపు అతడు వెళ్లేలా ఎలా మార్గనిర్దేశం చేస్తాడన్నదే ఈ మూవీ కథ.

విడుదలైన మూడు వారాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా విజయ పరంపర కొనసాగుతోంది. నవంబర్ 26 నాటికి అంటే విడుదలైన ఆరు వారాల తర్వాత కూడా ఈ చిత్రం వసూళ్లు సాధిస్తూనే ఉంది. 'లాలో' చిత్రంలో రీవా రాచ్, శ్రుహద్ గోస్వామి, కరణ్ జోషి, మిష్టీ కడేచా ప్రధాన పాత్రల్లో నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More