పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసిన దురంధర్.. రణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ కలెక్షన్ల మోత
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డును దురంధర్ బ్రేక్ చేసింది. ఆ రికార్డు విశేషాలు, కలెక్షన్లపై ఓ లుక్కేయండి.
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ పుష్ప 2 చిత్రం రికార్డును బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ క్రియేట్ చేసిన హిస్టరీని రణ్‌వీర్ సింగ్ తిరగరాశాడు.
దురంధర్ సినిమా పోస్టర్
పుష్ప 2 రికార్డు
దురంధర్ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ మూవీ తాజాగా పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసింది. రెండో శుక్రవారం అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా పుష్ప 2 ఉండేది. మూవీ రిలీజైన తర్వాత వచ్చిన రెండో శుక్రవారం రోజు పుష్ప 2 (హిందీ) రూ.27.50 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు శుక్రవారం (డిసెంబర్ 12) రూ.34.70 కోట్ల కలెక్షన్లతో పుష్ప 2 రికార్డును దురంధర్ బ్రేక్ చేసింది. పుష్ప 2 తర్వాత ఛావా (రూ.24.30 కోట్లు), యానిమల్ (రూ.23.53 కోట్లు) ఉన్నాయి.
దురంధర్ కలెక్షన్లు
దురంధర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తోంది. ఈ మూవీ ఎనిమిదో రోజైన శుక్రవారం కూడా మంచి వసూళ్లు సాధించింది. రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద బలమైన పరుగును కొనసాగిస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్.కామ్ ప్రకారం దురంధర్ ఇండియాలో 8 రోజుల్లో రూ.239.25 కోట్ల నెట్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇది రూ.300 కోట్లు దాటింది.
ఆ సినిమాలను దాటి
దురంధర్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర విడుదలైన మొదటి వారంలో రూ.207.25 కోట్లు వసూలు చేసింది. 8వ రోజు ఈ చిత్రం భారతదేశంలో రూ .32.00 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు రూ.239.25 కోట్లు వసూలు చేసింది. హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రాన్ని దురంధర్ దాటేసింది. వార్ 2 మూవీ 8వ రోజు రూ .5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాని మొదటి వారం కలెక్షన్లు రూ .204.25 కోట్లు.
రైడ్ 2 (రూ.173.05 కోట్లు), రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (రూ.153.55 కోట్లు), సికందర్ (రూ.109.83 కోట్లు) వంటి భారీ బాలీవుడ్ సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను దురంధర్ దాటేసింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్ రెండో పార్ట్ వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.