దురంధర్ వసూళ్ల సునామీ- 12వ రోజూ కలెక్షన్ల మోత- సలార్ రికార్డు బ్రేక్- ఎన్ని కోట్లంటే?

దురంధర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 12వ రోజు: రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. ఈ చిత్రం మరోసారి చరిత్ర సృష్టించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Updated on: Dec 17, 2025, 06:13:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ లేెటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది. రెండో వారంలోనూ ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. భారీ వసూళ్లతో రికార్డులు ఖాతాలో వేసుకుంటుంది. రెండో వారాంతం తర్వాతి వారపు రోజుల్లో కూడా ఈ రణ్‌వీర్ సింగ్ చిత్రం నిలకడగా కొనసాగుతోంది.

దురంధర్ కలెక్షన్లు
దురంధర్ కలెక్షన్లు

దురంధర్ కలెక్షన్లు

దురంధర్ మూవీ కలెక్షన్లలో కొత్త మైల్ స్టోన్లు అందుకుంటుంది. మంగళవారం (డిసెంబర్ 17) నాటికి దాదాపు ఎటువంటి క్షీణత లేకుండా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దీంతో ఈ చిత్రం రికార్డు సమయంలో ఇండియాలోనే రూ.400 కోట్ల మార్కును అధిగమించింది. దురంధర్ తన రెండో వారాంతంలో భారతదేశంలో రూ.140 కోట్లకు పైగా నికర లాభాలను ఆర్జించింది. ఇది హిందీ చిత్రాలకు కొత్త రికార్డు.

మంగళవారం ఇలా

సోమవారం దురంధర్ చిత్రం రూ.29 కోట్లు జోడించింది. మంగళవారం కూడా ఇదే ఊపును కొనసాగించింది. 12వ రోజు సక్నిల్క్ నివేదిక ప్రకారం దురంధర్ ఇండియా లో సుమారు రూ.28.78 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో దురంధర్ దేశీయ ఆదాయం రూ.410.03 కోట్లకు చేరుకుంది. ఆసక్తికరంగా సోమవారంతో పోలిస్తే మంగళవారం దురంధర్ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం షోలలో ఆక్యుపెన్సీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తే దురంధర్ తన మూడవ వీకెండ్ నాటికి రూ.500 కోట్ల నికర మార్కును చేరుకోవచ్చు.

ఈ రికార్డులు

దురంధర్ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. దంగల్, సలార్, రోబో 2.0 లాంటి సినిమాలను దాటేసింది. రూ.400 కోట్ల నికర దేశీయ వసూళ్లను సాధించిన ఏడో చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ మార్కును మంగళవారం సాయంత్రం అధిగమించింది. ఆరు సంవత్సరాలకు పైగా బాలీవుడ్ దేశీయ వసూళ్ల రికార్డుగా ఉన్న దంగల్ రూ.387 కోట్ల మార్కును దురంధర్ దాటేసింది.

సలార్ ను దాటి

ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ (రూ.406 కోట్లు), రజనీకాంత్ రోబో 2.0 (రూ.407 కోట్లు) ఇండియా లైఫ్ టైమ్ నెట్ కలెక్షన్లను దురంధర్ దాటేసింది. దురంధర్ అనేది ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్, పాకిస్తాన్‌లోని లియారీ గ్యాంగ్‌లలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలు పోషించారు. కథను ముగించే సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More