లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ మూవీ చూసిన టీమిండియా ప్లేయర్స్.. ఓ థియేటర్ మొత్తం బుక్ చేసుకొని..

టీమిండియా ప్లేయర్స్ సోమవారం (డిసెంబర్ 15) రాత్రి లక్నోలో దురంధర్ మూవీ చూశారు. సౌతాఫ్రికాతో నాలుగో టీ20 కోసం నగరానికి వచ్చిన మన క్రికెటర్లు.. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ ను చూసి ఎంజాయ్ చేశారు.

Published on: Dec 16, 2025, 21:41:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌతాఫ్రికాతో సిరీస్ జోరులో ఉన్న టీమిండియా.. నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు లక్నోలో కాసేపు రిలాక్స్ అయ్యింది. సోమవారం (డిసెంబర్ 15) రాత్రి కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో సహా జట్టు సభ్యులంతా కలిసి రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) సినిమాను చూశారు. వీరి భద్రత దృష్ట్యా థియేటర్‌లో ఒక స్క్రీన్ మొత్తాన్ని బుక్ చేయడం విశేషం.

లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ మూవీ చూసిన టీమిండియా ప్లేయర్స్.. ఓ థియేటర్ మొత్తం బుక్ చేసుకొని.. (Photo: X)
లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ మూవీ చూసిన టీమిండియా ప్లేయర్స్.. ఓ థియేటర్ మొత్తం బుక్ చేసుకొని.. (Photo: X)

దురంధర్ చూసిన క్రికెటర్లు

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు.. సోమవారం (డిసెంబర్ 15) ఉదయం లక్నో చేరుకుంది. బుధవారం (డిసెంబర్ 17) జరగాల్సిన కీలకమైన నాలుగో మ్యాచ్‌కు ముందు మానసిక ఉల్లాసం కోసం ప్లేయర్స్ సినిమా వైపు చూశారు.

సోమవారం రాత్రి లక్నోలోని ఫీనిక్స్ పలాసియో (Phoenix Palassio) మాల్‌లో ఉన్న మల్టీప్లెక్స్‌కు టీమిండియా చేరుకుంది. రాత్రి 8:10 గంటల షోలో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘దురంధర్’ను చూశారు.

టీమిండియా ప్లేయర్స్ భద్రత, ప్రైవసీ కోసం థియేటర్ యాజమాన్యం 'ఆడి నంబర్ 10' మొత్తాన్ని కేవలం టీమిండియా కోసమే కేటాయించింది. మొత్తం 40 మంది (ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్) ఈ సినిమాను చూశారు. అర్ధరాత్రి 12:10 గంటలకు షో ముగిసిన తర్వాత వారు హోటల్‌కు వెళ్లారు.

ఎవరెవరు వెళ్లారంటే?

ఈ మూవీ నైట్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తదితరులు క్యాజువల్ వేర్‌లో కనిపించారు. విశేషమేమిటంటే సౌతాఫ్రికాకు చెందిన భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా వారితో కలిసి ఈ హిందీ సినిమాను చూడటానికి వచ్చారు.

ఇక నాలుగో టీ20 విషయానికి వస్తే.. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా స్టేడియంలో జరగనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది. మూడో టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. రేపటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. భారత జట్టు హయత్ రీజెన్సీలో బస చేయగా.. సౌతాఫ్రికా జట్టు హోటల్ రినైసాన్స్‌లో ఉంటోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More