900 కోట్ల క్లబ్‌లోకి రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్- 19వ రోజు నాటి పుష్ప 2 రికార్డ్ బద్దలు!
రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురందర్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 900 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మూడో వారంలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు నెలకొల్పింది.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన 19 రోజుల్లోనే రికార్డుల మీద రికార్డులను తిరగరాస్తోంది.

వెయ్యి కోట్ల వైపుగా
అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు నటించిన ఈ స్పై థ్రిల్లర్ ఇప్పుడు వెయ్యి కోట్ల మార్కు వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. దురంధర్ సినిమా ప్రయాణం మొదటి రోజు నుంచే ఎంతో ఆశాజనకంగా మొదలైంది.
సీన్ రివర్స్
తొలి వారంలోనే ఏకంగా రూ. 207.25 కోట్లు కొల్లగొట్టిన 'ధురందర్' రెండో వారంలో ఆ వేగాన్ని మరింత పెంచింది. రెండో వారంలో ఏకంగా రూ. 253.25 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ సినిమాకైనా రెండో వారంలో వసూళ్లు తగ్గుతాయి. కానీ, దురంధర్ మూవీ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది.
మూడో వారంలో 'పుష్ప 2' రికార్డు క్లీన్ స్వీప్!
మూడో వారంలోనూ దురంధర్ తన పట్టు కోల్పోలేదు. మూడో శుక్రవారం రూ. 22.5 కోట్లు, శనివారం రూ. 34.25 కోట్లు, ఆదివారం రూ. 38.5 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం మూడో వారంలోని మొదటి 4 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక హిందీ చిత్రంగా 'ధురందర్' నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు 'పుష్ప 2' (హిందీ) పేరిట ఉండేది. కానీ, ఇప్పుడు ఆ రికార్డును రణ్‌వీర్ సింగ్ తన ఖాతాలో వేసుకున్నారు.
19వ రోజు కలెక్షన్స్
సోమవారం (18వ రోజు) వర్కింగ్ డే కావడంతో వసూళ్లు రూ. 16.5 కోట్లకు తగ్గినప్పటికీ, మంగళవారం (డిసెంబర్ 23-19వ రోజు) మాత్రం మళ్లీ పుంజుకుని రూ. 17.25 కోట్లు రాబట్టింది. హిందీ సినిమా చరిత్రలో 19వ రోజున కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 'ధురందర్' అగ్రస్థానంలో నిలిచింది.
19వ రోజు నాటి కలెక్షన్స్:
ధురందర్: రూ. 17.25 కోట్లు
పఠాన్: రూ. 12.6 కోట్లు
పుష్ప 2 (హిందీ): రూ. 10.5 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా
19 రోజుల ముగిసే సమయానికి భారతీయ మార్కెట్‌లో దురంధర్ సినిమా రూ. 589.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 18వ రోజు నాటికే రూ. 876.5 కోట్లకు చేరుకుంది. ఇక 19 రోజులకు వరల్డ్ వైడ్‌గా దురంధర్ రూ. 905 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని హిందుస్థాన్ టైమ్స్ ఇంగ్లీష్ వెబ్‌సైట్ పేర్కొంది.
అందులో రణ్‌వీర్ సింగ్ తొలి సినిమాగా
ఇదే జోరు కొనసాగితే త్వరలో యానిమల్ (రూ. 915 కోట్లు) బ్రేక్ చేసి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి దురంధర్ చేరే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో తొలి రూ. 1000 కోట్ల క్లబ్ మూవీగా దురంధర్ నిలుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


