60 శాతం పడిపోయిన దురంధర్ కలెక్షన్స్- కానీ, కాంతార 2 అవుట్- 872 కోట్లు@18- రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. 18 రోజుల్లోనే అత్యధిక వసూళ్లతో 2025లో బిగ్గెస్ట్ ఇండియన్ హిట్‌గా నిలిచింది. హాలీవుడ్ మూవీ 'అవతార్ 3' పోటీని తట్టుకుని మరీ ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది.

Published on: Dec 23, 2025, 09:46:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ధురంధర్’ వసూళ్ల వర్షం కురిపిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ఈ సినిమా పలు భారీ రికార్డులను తుడిచిపెట్టేసింది.

60 శాతం పడిపోయిన దురంధర్ కలెక్షన్స్- కానీ, కాంతార 2 అవుట్- 872 కోట్లు@18- రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్!
60 శాతం పడిపోయిన దురంధర్ కలెక్షన్స్- కానీ, కాంతార 2 అవుట్- 872 కోట్లు@18- రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్!

తగ్గిన దురంధర్ కలెక్షన్స్

తాజాగా దురంధర్ చిత్రం 2025 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా అగ్రస్థానానికి చేరుకుంది. మూడవ సోమవారం (డిసెంబర్ 22) ఈ సినిమా వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ ఓవరాల్‌గా మాత్రం తన దూకుడును అస్సలు తగ్గించడం లేదు.

కాంతార 2, ఛావా రికార్డులు కనుమరుగు!

ఇప్పటివరకు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా ఉన్న రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ (రూ. 852 కోట్లు), విక్కీ కౌశల్-రష్మిక మందన్నాల ‘ఛావా’ (రూ. 807 కోట్లు) రికార్డులను ‘ధురంధర్’ అధిగమించింది. 18 రోజులు ముగిసేసరికి దురంధర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 872 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.

హాలీవుడ్ దిగ్గజం ‘అవతార్ 3’తో పోటీపడి మరీ..

జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైనప్పటికీ ‘ధురంధర్’ తన హవాను కొనసాగించడం విశేషంగా మారింది. విదేశీ మార్కెట్లలోనూ దురంధర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.

టాప్ 10 ఇండియన్ సినిమాల జాబితా

ఇప్పటివరకు ఓవర్సీస్‌లో 20.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 170 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది దురంధర్ సినిమా. ఇదే ఊపు కొనసాగితే రాబోయే రెండు మూడు రోజుల్లోనే రూ. 915 కోట్ల క్లబ్‌లో చేరి ఆల్‌టైమ్ టాప్ 10 ఇండియన్ సినిమాల జాబితాలోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

భారతదేశంలో వసూళ్ల ప్రవాహం

ఇక దురంధర్ సినిమా ఇండియాల 18 రోజుల్లో రూ. 571.75 కోట్ల నెట్ (రూ. 686 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ వసూల చేసింది. మూడవ సోమవారం నాడు దాదాపు 60 శాతం డ్రాప్ కనిపించినప్పటికీ రూ. 16 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

సినిమా గురించి క్లుప్తంగా..

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్ ‘హంజా’ అనే ఇండియన్ ఏజెంట్ పాత్రలో నటించారు. కరాచీలోని టెర్రర్ నెట్‌వర్క్స్‌ను ఛేదించే ఒక సీక్రెట్ ఆపరేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More