దురంధర్ దాటికి నిలబడలేకపోయిన అవతార్ 3- 15వ రోజు కంటే తక్కువ- జేమ్స్ కామెరాన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఓపెనింగ్ కలెక్షన్స్?

జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కి ఇండియాలో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ గట్టి పోటీ ఇస్తోంది. 15వ రోజు కూడా ఈ హిందీ చిత్రం అవతార్ 3 తొలి రోజు వసూళ్ల కంటే ఎక్కువ సాధించి రికార్డు సృష్టించింది. మరి ఈ నేపథ్యంలో అవతార్ ఫైర్ అండ్ యాష్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఎంతో ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Dec 20, 2025, 13:23:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కామెరాన్ సృష్టించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మ్యాజిక్ మొదలైంది. కానీ, భారత బాక్సాఫీస్ వద్ద మాత్రం ఒక ఆసక్తికరమైన పోరు కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ హాలీవుడ్ విజువల్ వండర్ ఇండియాలో దురంధర్ దాటికి నిలబడలేకపోయింది.

దురంధర్ దాటికి నిలబడలేకపోయిన అవతార్ 3- 15వ రోజు కంటే తక్కువ- జేమ్స్ కామెరాన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఓపెనింగ్ కలెక్షన్స్?
దురంధర్ దాటికి నిలబడలేకపోయిన అవతార్ 3- 15వ రోజు కంటే తక్కువ- జేమ్స్ కామెరాన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఓపెనింగ్ కలెక్షన్స్?

తొలిరోజు 20 కోట్లు

అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ. 20.05 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. సాధారణంగా ఇవి మంచి నంబర్లే అనిపించినా అప్పటికే థియేటర్లలో ఉన్న ‘ధురంధర్’ జోరు ముందు ఇవి తక్కువగానే కనిపిస్తున్నాయి.

నిజానికి అవతార్ 3 మొదటి రోజు భారత్‌లో రూ. 30 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద అజేయంగా దూసుకుపోతుండటంతో అవతార్ 3 అంచనాలు తలకిందులయ్యాయి.

15వ రోజు కలెక్షన్స్ కంటే తక్కువ

విచిత్రం ఏంటంటే, విడుదలైన 15వ రోజు కూడా ‘ధురంధర్’ సినిమా ఇండియాలో రూ. 22.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే, ఒక సరికొత్త హాలీవుడ్ భారీ చిత్రం ఓపెనింగ్ డే సాధించిన దాని కంటే, 15 రోజుల పాత హిందీ సినిమా ఎక్కువుగా వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వారాంతాల్లో భారీ జంప్స్ చూపిస్తూ సాధారణ రోజుల్లోనూ నిలకడగా రాణిస్తూ రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ తన హవాను కొనసాగిస్తోంది. దీనితో పోలిస్తే ఇండియాలో అవతార్ 3 ప్రభావం ఆశించిన స్థాయిలో లేదనే చర్చ మొదలైంది.

ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్ 3’ ప్రభంజనం

ఇండియాలో అవతార్ 3 పరిస్థితి ఎలా ఉన్నా అంతర్జాతీయంగా మాత్రం జేమ్స్ కామెరాన్ తన సత్తా చాటుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్‌లో 43.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 386 కోట్లు) వసూలు చేసినట్లు డెడ్‌లైన్ నివేదిక పేర్కొంది.

ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో 2025లో అతిపెద్ద ఓపెనింగ్‌ సాధించిన చిత్రంగా అవతార్ ఫైర్ అండ్ యాష్ నిలిచింది. ఇక చైనాలో కూడా తొలిరోజే 17.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 153 కోట్లు) వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద నంబర్ 1 స్థానంలో నిలిచింది అవతార్ 3. అక్కడ ప్రేక్షకులనుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ధురంధర్ కలెక్షన్ల సునామీ

ఇక మరోవైపు అక్షయ్ ఖన్నా, రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధురంధర్’ అద్భుతమైన బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మొదటి రోజు రూ. 28 కోట్లతో మొదలైన ఈ సినిమా తొలి వారం ముగిసేసరికి రూ. 207.25 కోట్లు రాబట్టింది. రెండో వారంలో కూడా తగ్గేదే లే అన్నట్లుగా రూ. 253.25 కోట్లు వసూలు చేసింది.

దీనితో రెండు వారాల్లోనే దురంధర్ ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 483.15 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ. 710.5 కోట్లు (14 రోజుల వరకు) వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

భారతీయ సినిమాల సత్తా

ఇప్పుడు 15వ రోజు వసూళ్లను కూడా కలిపితే ఈ దురంధర్ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అవతార్ 3 వంటి భారీ సినిమా కూడా ‘ధురంధర్’ దాటిని తట్టుకోలేకపోవడం భారతీయ సినిమాల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More