ఇండియాలో అవతార్ ఫైర్ అండ్ యాష్ బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్.. థియేటర్లలో దీపాలతో 'A' వెలుగులు!

ఈ ఏడాది వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ఎదురుచూస్తున్న సినిమా అవతార్ ఫైర్ అండ్ యాష్. జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ 3 సినిమా కోసం ఇండియాలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అవతార్ 3 రిలీజ్ అయ్యే థియేటర్లలో దీపాలతో ఎ అక్షరాన్ని వెలుగులతో నింపారు.

Published on: Oct 25, 2025, 11:36:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హాలీవుడ్ దర్శక దిగ్గజాల్లో జేమ్స్ కామెరాన్ ఒకరు. అవతార్ సినిమాతో వరల్డ్ వైడ్‌గా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. ఇప్పటికే అవతార్ నుంచి రెండు సినిమాలు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు అవతార్ ఫ్రాంచైజీ నుంచి మూడో సినిమా కూడా రానున్న విషయం తెలిసిందే.

ఇండియాలో అవతార్ ఫైర్ అండ్ యాష్ బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్.. థియేటర్లలో దీపాలతో 'A' వెలుగులు!
ఇండియాలో అవతార్ ఫైర్ అండ్ యాష్ బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్.. థియేటర్లలో దీపాలతో 'A' వెలుగులు!

ఇండియాలో సినిమాటిక్ ఈవెంట్

అవతార్ 3గా అవతార్: ఫైర్ అండ్ యాష్ టైటిల్‌తో ఈ సినిమా రానుంది. ఇప్పటికీ అవతార్ 3 ట్రైలర్స్ రిలీజ్ అయి అబ్బురపరిచాయి. ఇక అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా చూసేందుకు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి సినిమా కోసం భారతదేశంలో భారీ సినిమాటిక్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

థియేటర్లలో దీపాలతో ఎ వెలుగులు

ఈ సందర్భంగా దీపాలతో ఎ అక్షరాన్ని ఏర్పాటు చేశారు. ఇండియాలో అవతార్ 3 విడుదలయ్యే థియేటర్లలో దీపావళి సందర్భంగా ఎ అక్షరాన్ని దీపాలతో పేర్చి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. మరికొందరు థియేటర్ల లోపల, బయట కూడా ముగ్గులు వేశారు. దీంతో అవతార్ 3 సినిమా కోసం ఇండియన్ ఆడియెన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుస్తోంది.

భావోద్వేగాలు, విలువలతో

పాండోరా గ్రహంలోని నివాసితులతో అవతార్: ఫైర్ అండ్ యాష్ మరోసారి భారతీయ థియేటర్లలోకి రానుంది. ఇది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా మారింది. భారతదేశ భావోద్వేగాలు, విలువలు, పండుగ స్ఫూర్తితో లోతుగా ప్రతిధ్వనించే అవతార్ సాగా చాలా కాలంగా భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.

ఇంతకుముందు లేని విధంగా

అవతార్: ఫైర్ అండ్ యాష్‌తో జేమ్స్ కామెరాన్ ఈ అసాధారణ సినిమాటిక్ విశ్వాన్ని ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా విస్తరించనున్నారు. జేమ్స్ కామెరాన్ దృష్టి, కథ చెప్పే ప్రతిభ పట్ల భారతదేశంపై శాశ్వత ప్రేమను పునరుద్ఘాటిస్తుంది.

డిసెంబర్ 19న రిలీజ్

ఇకపోతే 20వ సెంచరీ స్టూడియోస్ అవతార్: ఫైర్ అండ్ యాష్‌ సినిమాను విడుదల చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 19న అవతార్ 3 గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి ఆరు భాషల్లో అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ భారతదేశంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More