నెంబర్ 1గా దురంధర్ కలెక్షన్స్- రష్మిక మందన్నా ఛావాను దాటేసిన రణ్‌వీర్ సింగ్ మూవీ- 17 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఛావా కలెక్షన్స్ దాటేసి నెంబర్ 1 హిందీ సినిమాగా దురంధర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 17 రోజుల్లో ఈ కలెక్షన్స్ క్రాస్ చేసిన దురంధర్ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసుకుందాం.
భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ విజయం నమోదైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 845 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

కనుమరుగైన 'ఛావా' రికార్డు
ఈ ఏడాది ఇప్పటివరకు విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన 'ఛావా' (రూ. 807 కోట్లు) అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ఉండేది. అయితే, తాజాగా 'ధురంధర్' ఆ రికార్డును బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకుంది.
భారత దేశీయ మార్కెట్‌లో ఇప్పటివరకు దురంధర్ సినిమా రూ. 555.75 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అంతర్జాతీయంగా కూడా రణ్‌వీర్ మేనియా గట్టిగా కనిపిస్తోంది. సుమారు 20 మిలియన్ డాలర్ల ఓవర్సీస్ వసూళ్లతో దురంధర్ సినిమా తన హవా చాటుతోంది.
హాలీవుడ్ 'అవతార్ 3'పై భారతీయ పవర్!
భారత బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' తో తలపడినప్పటికీ 'ధురంధర్' పైచేయి సాధించడం విశేషం. జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకుడి సినిమా విడుదలైనా రణవీర్ సింగ్ మూవీ ఏమాత్రం తగ్గకుండా థియేటర్లను హౌస్‌ఫుల్‌తో దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఈ సినిమా రిషబ్ శెట్టి 'కాంతార: ది లెజెండ్ - చాప్టర్ 1' (రూ. 852 కోట్లు) వసూళ్లను అధిగమించే దిశగా పయనిస్తోంది. ఇదే జోరు కొనసాగితే, నూతన సంవత్సరం లోపు రూ. 1000 కోట్ల క్లబ్‌లో దురంధర్ చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కరాచీ గడ్డపై ఇండియన్ ఏజెంట్ సాహసం
దర్శకుడు ఆదిత్య ధర్ ధురందర్ చిత్రాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలిచారు. రణ్‌వీర్ సింగ్ 'హంజా' అనే భారతీయ ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయారు. కరాచీలోని టెర్రర్ నెట్‌వర్క్‌లను ఛేదించే ఒక ఇన్వెస్టిగేటివ్ స్పైగా రణ్‌వీర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు.
దురంధర్ సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ సారా అర్జున్ యాక్ట్ చేసింది. ఆమెతోపాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి స్టార్ నటులు తమ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పిల్లర్లుగా నిలిచారు.
దురంధర్ 2 రిలీజ్ డేట్
ఇదిలా ఉంటే ధురందర్ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ధురంధర్ 2 వచ్చే ఏడాది మార్చి 2026లో విడుదల కానుంది. దురంధర్ హిట్‌తో పార్ట్ 2పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


