ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. సారీ చెప్పిన రాజా సాబ్ డైరెక్టర్ మారుతి.. ఏం జరిగిందంటే?
రెబల్ సాంగ్ తో ఇప్పుడు ఎక్కడ చూసినా రాజా సాబ్ వైబ్ కనిపిస్తోంది. కానీ ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్లు మాత్రం కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు ఆయన సారీ కూడా చెప్పాడు.
ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాజా సాబ్. ఈ సినిమా నుంచి ఆదివారం (నవంబర్ 23) రాత్రి రెబల్ సాబ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సాంగ్ లాంఛ్ సందర్భంగా డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మారుతి సారీ కూడా చెప్పాడు. అసలేం జరిగిందో ఇక్కడ చూసేయండి.

మారుతి కామెంట్లు
రాజా సాబ్ మూవీ డైరెక్టర్ మారుతి కామెంట్లు కాంట్రవర్సీకి కారణమయ్యాయి. రెబల్ సాబ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో సినిమా గురించి, ప్రభాస్ గురించి మారుతి గొప్పగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే కాలర్ ఎగరేసుకుని చెప్పమంటూ చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి.
‘‘మీరందరూ రేపు పండక్కి.. నేను యాక్చువల్ గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు అని అలా చెప్పాలేను. అవన్నీ ఈ కటౌట్ కు చాలా చిన్న మాటలు అయిపోతాయి. ఎందుకంటే నేను ప్రస్తుతం రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా’’ అని మారుతి అన్నాడు.
కాలర్ ఎగరేసుకుంటారని
అయితే కామెంట్లలో కాలర్ ఎగరేసుకుంటారనే మాటలు చెప్పలేని అని మారుతి అనడం కాంట్రవర్సీకి దారి తీసింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే వార్ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాతో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారని తారక్ కాలర్ పట్టుకుని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో తారక్ ను ట్రోల్ చేసేలా మారుతి కామెంట్లు ఉన్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఎక్స్ లో పోస్టు
ఎక్స్ లో వెంకీ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ పోస్టు పెట్టాడు. ‘‘కాలర్ ఎగరేసుకుంటారు ఇలాంటివి చెప్పలేని కానీ అద్భుతం, నెక్ట్స్ లెవల్ అని ఇలా చెప్పి వదిలేసి ఉంటే బాగుండేది. అనవసరంగా రెండు కలిపి కంపారిజన్ లాగా చేశావ్’’ అని పోస్టు పెట్టాడు.
మారుతి సారీ
ఫ్యాన్ పోస్టుకు మారుతి సారీ చెప్తూ రిప్లై ఇచ్చాడు. ‘‘ప్రతి అభిమానికి నా క్షమాపణలు. ఏ ఒక్కరిని బాధ పెట్టడం లేదా అగౌరవపర్చడం నా ఉద్దేశం కాదు. కొన్ని సార్లు ఫ్లోలో మనం నిజంగా అనుకున్న అర్థం కాకుండా ఇతర మాటలు వస్తాయి. కానీ దీన్ని తప్పుగా లేదా కంపారిజన్ గా తీసుకున్నందుకు బాధపడుతున్నా. ఎన్టీఆర్, ఆయన అభిమానులంటే నాకెంతో గౌరవం’’ అని మారుతి పోస్టు పెట్టాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


