ఈ ఓటీటీలోకే మన శంకర వరప్రసాద్ గారు.. రికార్డు రేటుకు చిరంజీవి సినిమా డిజిటల్ రైట్స్.. లేటెస్ట్ బజ్!
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- మెగాస్టార్ చిరంజీవి కాంబో అనగానే ఎక్కడ లేని అంచనాలు మొదలయ్యాయి. వాటిని అందుకునే దిశగానే మన శంకర వరప్రసాద్ గారు మూవీ సాగుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ పై లేటెస్ట్ బజ్ ఒకటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
మన శంకర వరప్రసాద్ గారు అంటూ థియేటర్లో సందడి చేయడానికి చిరంజీవి వచ్చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్, పోస్టర్లు, పాటలతో ప్రమోషన్లను పరుగులు పెట్టిస్తున్నాడు మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా రిలీజైన శశిరేఖ పాటతో హైప్ మరింత పెరిగింది.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ
చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతి రేసులో నిలిచింది. ఈ మూవీని పండగకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ డీల్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. చిరంజీవి కెరీర్ లో అత్యధికంగా ఈ మూవీ ఓటీటీ హక్కుల కోసం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు పెట్టడానికి రెడీ అయినట్లు టాక్.
ఈ ఓటీటీలో
మన శంకర వరప్రసాద్ గారు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5, శాటిలైట్ హక్కులను జీ నెట్ వర్క్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం జీ నెట్ వర్క్ భారీ మొత్తాన్ని చెల్లించిందనే టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా జీ నెట్ వర్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
భారీ డిమాండ్
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంటున్నాడు. అతని కెరీర్ లో ఫ్లాప్ అన్నదే లేదు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ను తన సినిమాల్లో చూపిస్తున్నాడు.
ఇక అనిల్ రావిపూడి- మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ అనగానే అంచనాలు మొదలైపోయాయి. ఇక చిరును వింటేజీ లుక్ లో చూపిస్తూ టీజర్, ఆ తర్వాత పాటలు.. ఇలా సినిమా హైప్ ను మరో లెవల్ కు తీసుకెళ్తున్నాయి. ఇక పండక్కి సినిమాల పోటీ కారణంా మన శంకర వరప్రసాద్ గారు మూవీని థియేటర్లో చూడలేకపోయిన జనాలు ఇంట్లో చూసేందుకు ఇష్టపడతారు. పైగా ఫ్యామిలీతో కలిసి చూసేలా అనిల్ రావిపూడి మూవీస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ నెలకొంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


