చిరంజీవికి భారీ రెమ్యునరేషన్.. మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం రికార్డు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్

చిరంజీవి రెమ్యునరేషన్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం మెగాస్టార్ కు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

Published on: Nov 28, 2025, 08:02:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ మూవీ మన శంకర వరప్రసాద్ గారుతో ఈ సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. అనిల్ రావిపూడి డైరెక్షన్ తో నయనతార కూడా నటిస్తున్న ఈ సినిమా కోసం చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యువ హీరోలతో సమానంగా అతడు భారీ మొత్తం అందుకుంటున్నాడు.

చిరంజీవికి భారీ రెమ్యునరేషన్.. మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం రికార్డు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్
చిరంజీవికి భారీ రెమ్యునరేషన్.. మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం రికార్డు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్

చిరంజీవి రెమ్యునరేషన్ ఇలా..

మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవికి ఏకంగా రూ.72 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది చాలా ఎక్కవే అని చెప్పాలి. సాధారణంగా ఇలాంటి ఓ మోస్తరు బడ్జెట్ సినిమా కోసం ఇంత భారీ రెమ్యునరేషన్ ఊహకందనిదే. మొత్తం మూవీ బడ్జెటే సాధారణంగా ఈ స్థాయిలో ఉంటుంది.

అంతేకాకుండా చిరు కూడా లాభాల్లో వాటా తీసుకుంటూ ఉంటాడు. కానీ ఈ మన శంకరవరప్రసాద్ గారు కోసం ముందే ఇంత భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం. మరోవైపు ఈ సినిమాను సాహు గారపాటితోపాటు కలిసి చిరు కూతురు సుష్మిత నిర్మిస్తోంది. అంటే లాభాల్లో 50 శాతం వాటా ఆమెకు రానుంది. అది కూడా కొణిదెల ఇంటికి ప్లస్ పాయింటే.

మన శంకరవరప్రసాద్ గారు మూవీ గురించి..

అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ కొట్టిన విషయం తెలుసు కదా. ఈ సినిమా రూ.300 కోట్లకుపైగానే వసూలు చేసింది. ఇప్పుడు చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వచ్చే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయన్ అనే పాయింటే ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇక చిరుతో కలిసి అనిల్ తన మార్క్ కామెడీని ఎలా పండించాడనేది చూడటానికి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాకు ప్రభాస్ ది రాజా సాబ్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. అనిల్, చిరంజీవి జోడీకి ఉండే తమదైన ఫ్యాన్ బేస్ తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More