చిరంజీవి కంటే విజయ్ గొప్ప డ్యాన్సర్ కామెంట్స్.. సారీ చెబుతూనే చిరు సర్‌తోనూ ఇదే మాట చెప్పానన్న కీర్తి సురేష్
కీర్తి సురేష్ మెగాస్టార్ అభిమానులకు క్షమాపణ చెప్పింది. చిరంజీవి కంటే దళపతి విజయ్ గొప్ప డ్యాన్సర్ అని తాను చేసిన కామెంట్స్ పై విమర్శల నేపథ్యంలో ఆమె సారీ చెబుతూనే.. ఇదే విషయం తాను చిరు సర్ తోనూ చెప్పానని అనడం విశేషం.
నటి కీర్తి సురేష్ తన రాబోయే మూవీ 'రివాల్వర్ రీటా' ప్రమోషన్ కోసం బుధవారం (నవంబర్ 26) హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో తమిళ నటుడు విజయ్‌ని తన అభిమాన డ్యాన్సర్‌గా పేర్కొనడం ద్వారా చిరంజీవిని 'అవమానించినట్లు' ఆమెను ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగారు. దీనివల్ల చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పడంతో ఆమె క్షమాపణ అడిగింది. అయితే విజయ్ డ్యాన్స్ ఇష్టమని తాను చిరు సర్ తోనూ చెప్పానని ఆమె స్పష్టం చేసింది.

చిరంజీవి కంటే విజయ్ డ్యాన్స్ బాగుంటుందా?
రివాల్వర్ రీటా మూవీ ప్రమోషన్లలో భాగంగా కీర్తి సురేష్ ప్రెస్ మీట్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా కీర్తి ఒక ఇంటర్వ్యూలో తన అభిమాన డ్యాన్సర్‌గా విజయ్‌ను పేర్కొన్నారని రిపోర్టర్ ప్రస్తావించారు. చిరంజీవి అభిమానులు దీనిపై మండిపడ్డారని, తమ అభిమాన నటుడిని 'అవమానించినట్లు'గా భావించారని అన్నారు. మరి మీరు ఎందుకు అలా చెప్పారు? నిజంగానే చిరంజీవి కంటే విజయ్ మెరుగ్గా కనిపిస్తాడా అని అడిగారు.
దీనికి కీర్తి సురేష్ స్పందిస్తూ.. "ఎవరు మెరుగ్గా కనిపిస్తారు అనేదాని గురించి కాదు. నేను విజయ్ సర్‌కి ఎంత పెద్ద ఫ్యాన్‌నో చిరంజీవి గారికే తెలుసు. నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడాన్ని నేను గౌరవిస్తాను. ఆయనతో మాట్లాడినప్పుడు, మేము ఇలాంటి సంభాషణల గురించి చర్చించుకున్నాం. నేను ఏ విధంగానూ అగౌరవంగా మాట్లాడాలని అనుకోలేదు. ఒకవేళ చిరంజీవి గారి అభిమానుల మనసును నేను నొప్పించి ఉంటే దయచేసి క్షమించండి" అని చెప్పింది.
చిరంజీవి గారు స్పోర్టివ్‌గా తీసుకున్నారు
కీర్తి దీనిపై మరింత వివరణ ఇస్తూ.. "నేను చెప్పేదేమిటంటే నేను ఎవరితో నటించడానికి ఇష్టపడతాను లేదా ఎవరి డ్యాన్స్ ఇష్టపడతాను అనే దాని గురించి చిరంజీవి గారు నాతో మాట్లాడారు. నాకు విజయ్ సార్ డ్యాన్స్, సూర్య సార్ అంటే ఇష్టమని ఆయనకు చెప్పాను. ఆయన దాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు. చిరంజీవి గారు ఎంతటి మెగాస్టారో మనకు తెలుసు. ఎవరూ ఎవరికీ తక్కువ కాదు. ఇద్దరూ గొప్ప నటులు. మా అమ్మ (నటి మేనక) చిరంజీవి గారితో కలిసి నటించింది. ఆయన దేశంలోనే అతి పెద్ద స్టార్లలో ఒకరు" అని స్పష్టం చేసింది.
ఎవరూ తక్కువ కాదనడం తప్పా?
కీర్తి సురేష్ సమాధానంతో సంతృప్తి చెందని ఆ రిపోర్టర్ తన ప్రశ్నలను కొనసాగించారు. చిరంజీవి గారికి అంత సుదీర్ఘ కెరీర్, స్టార్‌డమ్ ఉన్నప్పుడు, విజయ్, చిరంజీవి ఒకరి కంటే మరొకరు తక్కువ కాదని మీరు ఎలా చెప్పగలరు అని ప్రశ్నించారు.
దీనిపై కీర్తి సురేష్ ఇలా సమాధానం ఇచ్చింది. "ఆయన ఒక మెగాస్టార్, ఒక లెజెండ్, మాకు తెలుసు. కానీ విజయ్ సార్ కూడా అక్కడ ఒక లెజెండ్. వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను ఏది ఫీల్ అయ్యానో చెప్పడం నా వ్యక్తిగత అభిప్రాయం. నేను విజయ్ సార్ సినిమాలు ఎక్కువగా చూడటం కూడా ఒక కారణం. నా నిజాయితీని చిరంజీవి గారు కూడా అభినందించారు" అని కీర్తి వెల్లడించింది.
నిజానికి రిపోర్టర్ ప్రస్తావించిన సంభాషణ 2024లో జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి, విజయ్‌లలో మెరుగైన డ్యాన్సర్‌ను ఎంచుకోమని కీర్తిని అడిగారు. అప్పుడు ఆమె "విజయ్ సార్ నా అభిమాన డ్యాన్సర్" అని చెప్పింది. ఇక కీర్తి నటించిన రివాల్వర్ రీటా మూవీ ఈ శుక్రవారం (నవంబర్ 28) తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


