భగవద్గీతతో పోలుస్తున్నారు, 2 ఓటీటీ వాళ్లు వెంటనే కొనేసుకున్నారు- హారర్ థ్రిల్లర్ శంబాల ఓటీటీ రైట్స్‌పై డైరెక్టర్ యుగంధర్
తెలుగులో లేటెస్ట్‌గా వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా శంబాల. ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయన్ తదితరులు నటించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. సినిమా చూసిన వెంటనే రెండు ఓటీటీ సంస్థలు శంబాల మూవీని కొనేసుకున్నాయని డైరెక్టర్ యుగంధర్ ముని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా శంబాల. అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, ఇంద్రనీల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.

శంబాల సక్సెస్ ఈవెంట్
డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన శంబాల మంచి టాక్‌తో పేరు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శంబాల సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో శంబాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడంపై డైరెక్టర్ యుగంధర్ ముని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రతి ఒక్కరు
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. "శంబాల సక్సెస్‌కి నేను ఒక్కడిని కారణం కాదు. ఇదంతా టీమ్ వర్క్. నా నిర్మాతలు మహీధర్ గారు, రాజశేఖర్ గారి సపోర్ట్ వల్లే చిత్రం ఇంత బాగా వచ్చింది. ఆది గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రకు న్యాయం చేశారు" అని అన్నారు.
గాయాలైన సపోర్ట్ చేశారు
"ఇంటర్వెల్ బ్లాక్ చిత్రీకరిస్తున్నప్పుడు ఆర్టిస్టులందరికీ గాయాలు అయ్యాయి. అయినా అందరూ సపోర్ట్ చేసి నటించారు. ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ ఆర్ఆర్, శ్రవణ్ ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నాకంటే శ్రీ చరణ్‌నే అందరూ ఎక్కువగా పొగుడుతున్నారు" అని యుగంధర్ ముని తెలిపారు.
భగవద్గీతతో పోలుస్తున్నారు
"సినిమాకి ప్రతీ ఒక్కరూ కష్టపడతారు. కానీ, కొన్ని చిత్రాలే ఆడియెన్స్‌కి నచ్చుతాయి. చాలా లేయర్స్‌తో ఈ మూవీని తీశాను. ఆడియెన్స్ మా సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. భగవద్గీతతో మా చిత్రాన్ని పోల్చుతున్నారు. సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ, ఈ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు" అని దర్శకుడు చెప్పారు.
రెండు ఓటీటీ వాళ్లు
"ఈ మూవీని థియేటర్లో చూస్తేనే సౌండింగ్‌ను ఫీల్ అవుతారు. ఈ మూవీని రాజేష్ దండా గారికి ముందే చూపించాం. ఈ సినిమా చూసిన వెంటనే హిట్టు అని రాజేష్ దండా గారు ఒకే మాట చెప్పారు. జీ, ఆహా రెండు ఓటీటీ వాళ్లు మా మూవీని చూసి వెంటనే కొనేసుకున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అదరగొట్టేశాడు అని మైత్రి శశి ప్రశంసించారు" అని శంబాల ఓటీటీ రైట్స్ గురించి డైరెక్టర్ యుగంధర్ ముని వెల్లడించారు.
సాయి కుమార్ గారి వల్లే
"మేం కంటెంట్ ఎంత బాగా తీసినా అది జనాల వరకు రీచ్ అవ్వాలి. సాయి కుమార్ గారి వల్లే ఈ చిత్రానికి ఈ రీచ్ వచ్చింది. ముందు నుంచీ కూడా మా సినిమాకి ఓ డివైన్ వైబ్ ఉంటూ వచ్చింది. మా మూవీ కోసం ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి సపోర్ట్ చేసింది. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్" అని స్పీచ్ ముగించారు యుగంధర్ ముని.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


