50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా, ఇది ఆడియెన్స్ గిఫ్ట్- ఆదికి అదే చెప్పాను.. నటుడు సాయి కుమార్ కామెంట్స్

నటుడుగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు సాయి కుమార్. ఆయన కుమారుడు ఆది సాయి కుమార్ హీరోగా తెలుగులో నటించిన లేటెస్ట్ మూవీ శంబాల. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ నేపథ్యంలో ఇటీవల సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Dec 31, 2025, 17:49:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు సాయి కుమార్. హీరోగా కూడా ఎంతగానో అలరించిన సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా శంబాల.

50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా, ఇది ఆడియెన్స్ గిఫ్ట్- ఆదికి అదే చెప్పాను.. నటుడు సాయి కుమార్ కామెంట్స్
50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా, ఇది ఆడియెన్స్ గిఫ్ట్- ఆదికి అదే చెప్పాను.. నటుడు సాయి కుమార్ కామెంట్స్

శంబాల విజయోత్సవ వేడుక

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన శంబాల సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శంబాల విజయోత్సవ వేడుక అంటూ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నటుడు సాయి కుమార్ ఆసక్తికర విశేషాలు చెప్పారు.

50 ఏళ్లుగా ఇండస్ట్రీలో

సాయి కుమార్ మాట్లాడుతూ .. "అమ్మానాన్నల ఆశీర్వాదంతో 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు ఇలా ‘శంబాల’తో హిట్టు ఇవ్వడం ఆడియెన్స్ గిఫ్ట్. సినిమా ఫ్లాప్ అయినా ప్రయత్నం ఆపొద్దు అని మా అమ్మ గారు నాకు చెబుతుండేవారు. అదే మాట ఆదికి కూడా చెప్పాను" అని అన్నారు.

ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది

"నా సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇలా ‘శంబాల’తో హిట్టు రావడం ఆనందంగా ఉంది. మహీధర్ రెడ్డి, రాజశేఖర్ గారు ఎంతో ప్యాషన్‌తో ఈ మూవీని నిర్మించారు. నిర్మాతలు సంతోషంగా ఉన్నంత వరకు ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. నిర్మాత పెట్టిన ఖర్చు రావాలి, దాంతో పాటుగా లాభాలు రావాలి" అని సాయి కుమార్ కోరారు.

ప్రస్థానం నుంచి అనుబంధం

"యుగంధర్ చాలా సైలెంట్‌గా ఉంటారు. ‘ప్రస్థానం’ నుంచి సందీప్ కిషన్‌తో అదే అనుబంధం ఉంది. కోన వెంకట్ నాకు ఫ్యామిలీ లాంటివాడు. ‘నువ్వుగా వెళ్లి సక్సెస్ అయి రా’ అని నాతో మా నాన్న చెప్పారు. అదే మాటని ఆదికి నేను చెప్పాను. ఆది ఎక్కువగా మాట్లాడడు. ‘ప్రేమ కావాలి’ నుంచి ఇప్పటి వరకు ఆది కష్టపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ‘శంబాల’తో విజయం సాధించాడు" అని సాయి కుమార్ పేర్కొన్నారు.

మన ఆది హిట్టు కొట్టారు

"‘శంబాల’ ప్రివ్యూని చూసి ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గానే స్పందించారు. ప్రతీ ఒక్కరూ ‘మన ఆది హిట్టు కొట్టారు’ అని చెబుతుంటే ఆనందంగా ఉంది. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన అభిమానులందరికీ థాంక్స్. ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు థాంక్స్" అని నటుడు సాయి కుమార్ తన స్పీచ్ ముగించారు.

నిర్మాతతోనే ఏ సినీ ప్రయాణమైనా

ఇదే ఈవెంట్‌లో అయ్యప్ప శర్మ మాట్లాడుతూ .. "‘శంబాల’ ఆడియెన్స్ అందరికీ నచ్చింది. నిర్మాతలతోనే ఏ సినీ ప్రయాణమైనా మొదలవుతుంది. ఏదైనా మూవీ హిట్ అయితే.. ఆ టీం మాత్రమే హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆది హిట్టు కొడితే ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఆది ఎప్పుడూ ఇలానే ఉండాలి" అని అన్నారు.

నిలబెట్టుకోవడం కష్టం

"ఆడియెన్స్‌కి, అభిమానులకి ఏం కావాలో అదే ఇవ్వాలని ఆదిని కోరుకుంటున్నాను. హిట్టు కొట్టడం కంటే నిలబెట్టుకోవడం కష్టం. నిర్మాణంలో వృథా ఖర్చులు అందరూ తగ్గించుకోవాలి. సాయి అన్న ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. ‘కేజీయఫ్’కి కూడా ‘శంబాల’ టీంలానే ప్రమోషన్స్ చేశాం. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్" అని అయ్యప్ప శర్మ పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More