ఓటీటీ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ 5 క్లైమాక్స్‌పై ఫ్యాన్స్ ఫైర్- గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే దారుణమంటూ రచ్చ!
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఓటీటీ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ గ్రాండ్ ఫినాలే అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఊహకందని మలుపులు ఉంటాయన్న మేకర్స్ మాటలు నమ్మి భంగపడ్డామని, ఇదొక అత్యంత పేలవమైన ముగింపు అని నెటిజన్లు మండిపడుతున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే దారుణమని రచ్చ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. డఫర్ బ్రదర్స్ సృష్టించిన అద్భుత మాయా ప్రపంచం ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things) ఆఖరి ఎపిసోడ్ డిసెంబర్ 31న విదేశాల్లో, జనవరి 1న ఇండియాలో విడుదలైంది.

అయితే, స్ట్రేంజర్ థింగ్స్ 5 ఫైనల్ ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త ఏడాది తీపి జ్ఞాపకాన్ని అందించాల్సింది పోయి తీవ్ర నిరాశను మిగిల్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఓటీటీ సిరీస్ క్లైమాక్స్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
యాప్ క్రాష్‌తో మొదలై.. అసంతృప్తితో ముగిసి..
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ చూడటానికి జనం ఒక్కసారిగా ఎగబడటంతో నెట్‌ఫ్లిక్స్ యాప్ కాసేపు మొరాయించింది. ఆ అడ్డంకిని అధిగమించి సిరీస్ చూసిన ఫ్యాన్స్‌కు క్లైమాక్స్ పెద్ద షాక్ ఇచ్చింది.
కథను ముగించిన తీరు అత్యంత సాధారణంగా ఉందని, ప్రతి సన్నివేశాన్ని ముందే ఊహించగలిగేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (GoT) ముగింపుపై వచ్చిన విమర్శలను ఇది గుర్తుచేస్తోంది. నిజానికి కొందరైతే, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ముగింపు కంటే ‘స్ట్రేంజర్ థింగ్స్’ క్లైమాక్స్ దారుణంగా ఉందని ఎక్స్ (X) వేదికగా పోస్టులు పెడుతున్నారు.
శక్తివంతుడైన వెక్నా.. అంత ఈజీగా దొరికిపోయాడా?
ఈ 5 సీజన్ అంతా విలన్ 'వెక్నా'ను చాలా శక్తివంతుడిగా చూపించి.. చివరకు ఎలెవన్, ఆమె స్నేహితులు అతడిని కేవలం ఐదు నిమిషాల్లోనే మట్టుబెట్టడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఇంత పవర్‌ఫుల్ విలన్‌కు ఇదేనా మీరు ఇచ్చే ముగింపు?" అని ప్రశ్నిస్తున్నారు.
"ఇది నిజమైన ఎపిసోడ్ కాదని, రేపు అసలు క్లైమాక్స్ రిలీజ్ చేస్తారని ఎవరో ఒకరు చెప్పండి" అంటూ కొందరు అసహనంతో సెటైర్లు వేస్తున్నారు. ఏళ్ల తరబడి బిల్డప్ ఇచ్చిన హెన్రీ క్రీల్ (వెక్నా) గతాన్ని కూడా సరిగ్గా వివరించలేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.
ముందే ఊహించిన చావు.. లేని ట్విస్టులు!
క్లైమాక్స్ ఎపిసోడ్‌లో ఎవరూ ఊహించని మలుపులు ఉంటాయని డఫర్ బ్రదర్స్ ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయని నెటిజన్లు మండిపడుతున్నారు. "కేవలం ఒకే ఒక్క వ్యక్తి చనిపోవడం, అది కూడా ముందే ఊహించినట్టు జరగడం చాలా నిరాశపరిచింది. ఇంత కాలం వేచి చూసినందుకు మాకు దక్కిన ప్రతిఫలం ఇదేనా?" అని ఒక అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
గతంలో ఎలెవన్ పాత్రధారి మిల్లీ బాబీ బ్రౌన్ కూడా ఈ ముగింపు పట్ల సంతృప్తిగా లేరని చెప్పిన విషయాన్ని నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు.
కొంతమంది మద్ధతు
అయితే, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ముగింపుపై అందరూ నిరాశ చెందలేదు. మరికొంతమంది మాత్రం క్లైమాక్స్ చాలా బాగుందని అంటున్నారు. డఫర్ బ్రదర్స్ అన్ని చిక్కుముడులను చక్కగా విప్పారని మద్దతుగా నిలుస్తున్నారు.
ఇది వరకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎండింగ్‌ను కూడా ఇలాగే సరిగా అర్థం చేసుకోలేదని, రెండు మూడు సార్లు చూస్తే అదే సరైన ముగింపుగా అనిపిస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా స్ట్రేంజర్ థింగ్స్ అన్ని సీజన్స్ తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


