ఒక్కటైన ఓటీటీ బద్ధ శత్రువులు- అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ మధ్య క్రేజీ డీల్- జేమ్స్ బాండ్ సూపర్ హిట్ సినిమాలతో షురూ!
ఓటీటీ స్ట్రీమింగ్ రంగంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అమెజాన్ ప్రైమ్-నెట్‌ఫ్లిక్స్ మధ్య కుదిరిన భారీ ఒప్పందంతో జేమ్స్ బాండ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన జేమ్స్ బాండ్ సూపర్ హిట్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే!
జేమ్స్ బాండ్ అభిమానులారా.. సిద్ధంగా ఉండండి! గూఢచారి 007 సాహసాలను ఇప్పుడు మీ ఫేవరెట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించే సమయం వచ్చేసింది. ఓటీటీ రంగంలో బద్ధ శత్రువులుగా భావించే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల మధ్య కుదిరిన ఒక అనూహ్య ఒప్పందం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ యాజమాన్యంలోని ఎంజీఎం (MGM) స్టూడియోస్‌కు చెందిన జేమ్స్ బాండ్ సూపర్ హిట్ చిత్రాలు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, కేవలం మూడు నెలలు మాత్రమే ఈ సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌లో చూడగలరు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యే జేమ్స్ బాండ్ సినిమాలు :
1. డై అనదర్ డే (Die Another Day)
2. నో టైమ్ టు డై (No Time to Die)
3 క్వాంటం ఆఫ్ సోలేస్ (Quantum of Solace)
4. స్కైఫాల్ (Skyfall)
అయితే, జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు మరికొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాయి. వాటిలో 'రాకీ' (Rocky), 'క్రీడ్' (Creed), 'లీగల్లీ బ్లోండ్' (Legally Blonde) వంటి చిత్రాలు ఉన్నాయి.
అలాగే, అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'ది మ్యాన్ ఇన్ ద హై కాస్టల్' (The Man in the High Castle), డేవిడ్ వెయిల్ రూపొందించిన 'హంటర్స్' (Hunters) అనే క్రైమ్ డ్రామా సిరీస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఏయే దేశాల్లో అందుబాటులో ఉండనున్నాయి?
డెడ్‌లైన్ నివేదిక ప్రకారం.. ఈ జేమ్స్ బాండ్ చిత్రాలు అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, లాటిన్ అమెరికా వంటి దేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హంటర్స్ ఓటీటీ సిరీస్ మాత్రం ఈ దేశాల్లో ఏడాది పాటు స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
సాధారణంగా అమెజాన్ తన సొంత కంటెంట్‌ను ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇవ్వదు. కానీ, ఈసారి వ్యూహాత్మకమైన అడుగు వేసింది ప్రైమ్ వీడియో. జేమ్స్ బాండ్ వంటి భారీ బ్రాండ్‌ను మరిన్ని కోట్ల మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ వర్గాలు చెబుతున్నాయి.
దీనివల్ల కంపెనీకి భారీగా లైసెన్సింగ్ ఆదాయం లభిస్తుందని వారి అంచనా. గతంలో వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా తమ ‘హెచ్‌బీఓ’ షోలను నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించింది. అదే బాటలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నడుస్తోంది.
ఈ సందర్భంగా అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ప్రతినిధి క్రిస్ ఒట్టింగర్ మాట్లాడుతూ.. "జేమ్స్ బాండ్ అనేది సినిమా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ఫ్రాంచైజీ. నెట్‌ఫ్లిక్స్‌తో మాకున్న మంచి సంబంధాల వల్ల ఈ ఐకానిక్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరింత మంది ప్రేక్షకులకు దగ్గర చేయగలుగుతున్నాం" అని వివరించారు.
ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్‌కు కూడా
ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ప్రకారం అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, నార్డిక్స్, లాటిన్ అమెరికా దేశాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే, భవిష్యత్తులో ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్‌కు కూడా అమెజాన్ ప్రైమ్ కంటెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో చూసే అవకాశం దక్కే అవకాశం కూడా ఉంది.
సాధారణంగా ప్రతి ఏటా అక్టోబర్ నెలలో 'గ్లోబల్ బాండ్ డే' సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రావడం అనేది బాండ్ 007 ప్రియులకు నిజంగా పండగే అని చెప్పాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


