ఓటీటీ సిరీస్ తర్వాత హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ మూవీ- పూజా కార్యక్రమాలతో బొమ్మ హిట్ ప్రారంభం- హీరో ఏం చెప్పాడంటే?
ఓటీటీ సిరీస్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ అభినవ్ మణికంఠ నటించిన లేటెస్ట్ మూవీ బొమ్మ హిట్. వెండితెరపై అభినవ్ మణికంఠ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజేష్ గడ్డం డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. తాజాగా డిసెంబర్ 20న హైదరాబాద్‌లో బొమ్మ హిట్ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా చేసిన కొత్త సినిమా "బొమ్మ హిట్". ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. బొమ్మ హిట్ చిత్రంతో రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

పూజా కార్యక్రమాలతో ప్రారంభం
బొమ్మ హిట్ సినిమాలో పూజా యడం హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 20న పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంతరం మూవీ హైలైట్స్ గురించి ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం తెలిపారు.
ర్యాంబ్ ఇన్ లవ్ ఓటీటీ సిరీస్
ఈ కార్యక్రమంలో హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. "ఇది హీరోగా నాకు రెండో సినిమా. ఫస్ట్ ఫిలిం వర్క్స్ జరుగుతున్నాయి. నేను నటించిన ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది" అని తెలిపాడు.
సిచ్యువేషనల్ కామెడీతో
"బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సిచ్యువేషనల్ కామెడీతో వినోదాన్ని ఇస్తుంది. ఈ చిత్రంలో ఫన్‌తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. ఈ మధ్య ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా బొమ్మ హిట్ సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా" అని హీరో అభినవ్ మణికంఠ ఆశించాడు.
కొత్త దర్శకుడినని
డైరెక్టర్ రాజేష్ గడ్డం మాట్లాడుతూ.. "బొమ్మ హిట్ మూవీతో నేను దర్శకుడిగా టాలీవుడ్‌లోకి వస్తుండటం సంతోషంగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ సంధ్యరాణి గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. నేను కొత్త దర్శకుడిని అని అనిపించడం లేదు" అని అన్నారు.
మంచి మెసేజ్ ఉంటుంది
"బొమ్మ హిట్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌తో ఉంటుంది. ప్యాడింగ్ ఆర్టిస్టులు మా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సమ్మర్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అని దర్శకుడు రాజేష్ గడ్డం తెలిపారు.
బలమైన కథ ఇది
నిర్మాత గుర్రాల సంధ్యారాణి మాట్లాడుతూ.. "మా అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా బొమ్మ హిట్ సినిమాను నిర్మిస్తున్నాం. దర్శకుడు రాజేష్ మంచి కథ చెప్పాడు. బలమైన ఈ కథను బాగా తెరకెక్కిస్తే తప్పకుండా హిట్ మూవీ అవుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రేమకథతో పాటు
"ఇందులో హీరో హీరోయిన్స్ ప్రేమ కథతో పాటు తల్లిదండ్రులు, కొడుకు మధ్య ఉండే అనుబంధం ఆకట్టుకుంటుంది. టెక్నీషియన్స్, ఆర్టిస్టుల సపోర్ట్‌తో సక్సెస్‌పుల్‌గా మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాం. బొమ్మ హిట్ సినిమాను హిట్ చేసి మరోసారి మీ ముందుకు వస్తాం" అని ప్రొడ్యూసర్ గుర్రాల సంధ్యారాణి పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


