నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే.. రామ్ పోతినేని సినిమా హవా.. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ కూడా..
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో తాజాగా ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాల జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో తెలుగు మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా రెండో స్థానంలో ఉండటం విశేషం. మరో మలయాళం మిస్టరీ థ్రిల్లర్ కూడా ఇందులో ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో (Netflix India) ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాల లిస్ట్ వచ్చేసింది. ఇందులో కొత్త సినిమాలతో పాటు 'దంగల్', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' లాంటి పాత బ్లాక్ బస్టర్స్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. హుమా ఖురేషి నటించిన 'సింగిల్ సల్మా' టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా రెండో స్థానంలో ఉంది.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 సినిమాలు
నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. అయితే ఆడియెన్స్ ఏ సినిమాలను ఎక్కువగా చూస్తున్నారో తెలిపే లేటెస్ట్ ట్రెండింగ్ లిస్ట్ ఇది. వీటిలో కొత్త, పాత సినిమాలతోపాటు వివిధ భాషలకు చెందినవి కూడా ఉండటం విశేషం. అయితే టాప్ లో ఓ ఫిమేల్ లీడ్ మూవీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
1. సింగిల్ సల్మా (Single Salma)
మహారాణి వెబ్ సిరీస్ ఫేమ్ హుమా ఖురేషి లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇదో రొమాంటిక్ కామెడీ మూవీ. అయితే ఐఎండీబీలో కేవలం 4.5 రేటింగే నమోదైంది.
2. ఆంధ్రా కింగ్ తాలూకా
రామ్ పోతినేని నటించిన తెలుగు మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' రెండో స్థానంలో నిలిచింది. ఇదొక కామెడీ డ్రామా మూవీ. ఓ మూవీ స్టార్, వీరాభిమాని చుట్టూ తిరుగుతుంది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా నెట్‌ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
3. ఎకో (Eko)
మలయాళం మిస్టరీ థ్రిల్లర్ 'ఎకో' మూడో స్థానంలో ఉంది. థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లు దీన్ని బాగా చూస్తున్నారు. గతేడాది మంచి వసూళ్లు సాధించిన మలయాళం సినిమాల్లో ఇదీ ఒకటి.
4. రివాల్వర్ రీటా
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'రివాల్వర్ రీటా' నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది.
5. రాత్ అకేలీ హై
నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'రాత్ అకేలీ హై: ది బన్సల్ మర్డర్స్' ఐదో స్థానంలో ఉంది. ఈ సినిమా ఓటీటీలోకి నేరుగా రాగా.. వచ్చినప్పటి నుంచీ దూసుకెళ్తూనే ఉంది.
6. స్నైపర్: ది లాస్ట్ స్టాండ్
హాలీవుడ్ యాక్షన్ సినిమా ఇది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆరో స్థానంలో నిలిచింది.
7. దంగల్
ఆమిర్ ఖాన్ నటించిన 2016 నాటి బ్లాక్ బస్టర్ 'దంగల్' మళ్లీ టాప్ 10లోకి వచ్చింది. ప్రస్తుతం ఇది ఏడో స్థానంలో ఉంది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచిన దంగల్.. ఇప్పుడు టాప్ 10 లో ట్రెండ్ అవుతుండటం ఆశ్చర్యం కలిగించేదే.
8. ది గ్రేట్ ఫ్లడ్
ఇదొక కొరియన్ సినిమా. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కింది. ఐఎండీబీలో 5.4 రేటింగ్ ఉంది. ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
9. చెన్నై ఎక్స్‌ప్రెస్
షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ కాంబినేషన్‌లో వచ్చిన 2013 నాటి సూపర్ హిట్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ తొమ్మిదో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇది కూడా కాస్త ఆశ్చర్యం కలిగించేదే.
10. జాలీ ఎల్‌ఎల్‌బీ 3
అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' పదో స్థానంలో ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


