థియేటర్లో అలా.. ఓటీటీలో ఇలా.. దుమ్మురేపుతున్న రామ్ పోతినేని సినిమా.. ట్రెండింగ్ నంబర్‌వన్
థియేటర్లో పాజిటివ్ తెచ్చుకున్నా, అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ మూవీ నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. థియేటర్లో ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ దక్కినా, కలెక్షన్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. కానీ ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ
వరుసగా ఫ్లాప్ లు చూసిన రామ్ పోతినేని తన రూట్ మార్చాడు. కొత్త కథతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అంటూ థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లో రిలీజైంది. కానీ కలెక్షన్లు మాత్రం గొప్పగా లేవు. ఇక డిసెంబర్ 25న ఓటీటీలోకి వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
ట్రెండింగ్ నంబర్ వన్
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో అదరగొడుతోంది. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసి మూవీపై ప్రశంసలు కురిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఇండియాలో ఆంధ్రా కింగ్ తాలూకా ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది.
పాజిటివ్ టాక్
మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ రాంగ్ టైమింగ్ కారణంగా ఈ మూవీ వసూళ్లు దెబ్బతిన్నారు. 10 మందిలో 10 మంది మా సినిమా బాగుందని అంటున్నారు, కానీ ఆ 10 మంది మాత్రమే సినిమా చూస్తున్నారని కూడా రామ్ పోతినేని ఆవేదన వ్యక్తం చేశాడు. థియేట్రికల్ రన్ సమయంలో, ఈ చిత్రం మొత్తం రూ.23.49 కోట్ల నెట్ వసూలు చేసింది. భారతదేశంలో గ్రాస్ వసూళ్లు రూ.27.43 కోట్లుగా ఉన్నాయి.
ఆంధ్రా కింగ్ తాలూకా స్టోరీ
తన అభిమాన హీరో కోసం పెద్ద త్యాగం చేసే ఫ్యాన్ కథే ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ గా ఉపేంద్ర నటించాడు. ఫ్యాన్ సాగర్ గా రామ్ పోతినేని యాక్ట్ చేశాడు. సూర్య కుమార్ పెద్ద స్టార్ గా ఎదుగుతాడు. ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో సాగర్ ఒకరు. సూర్య తన 100వ సినిమాను ఘనంగా ప్రారంభిస్తాడు.
కానీ సూర్య వందో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. ఆ సమయంలో సాగర్ రూ.3 కోట్లను తన హీరోకు పంపిస్తాడు. మరి ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందా? సాగర్ కు ఆ రూ.3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


