నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్ల‌కు అదిరే న్యూస్‌-ఈ ఓటీటీలో ఈటీవీ విన్ బ్లాక్ బ‌స్ట‌ర్లు స్ట్రీమింగ్‌-ఓ లుక్కేయండి

నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు పండగే. ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ లో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్ ఆడియన్స్ కోసం ఈ సూపర్ హిట్లు అందుబాటులో ఉన్నాయి. 

Published on: Dec 20, 2025, 14:21:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో కొత్త ట్రెండ్. సాధారణంగా అయితే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన చాలా రోజుల తర్వాత సినిమాలు ఇతర ఓటీటీల్లోకి వస్తాయి. కానీ ఒరిజినల్ వెబ్ సిరీస్ లు మాత్రం అలా కాదు. ఏ ఓటీటీకి ఆ ఓటీటీ స్పెషల్ వెబ్ సిరీస్ లు ఉంటాయి. ఇప్పుడా వెబ్ సిరీస్ లు కూడా ఒక ఓటీటీలోనివి మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈటీవీ విన్ సిరీస్ లు, సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ లో ఈటీవీ విన్ సినిమాలు, సిరీస్ లు (x/Netflix_INSouth)
నెట్‌ఫ్లిక్స్ లో ఈటీవీ విన్ సినిమాలు, సిరీస్ లు (x/Netflix_INSouth)

ఈటీవీ విన్ ఒరిజినల్స్

ఈటీవీ విన్ ఓటీటీ తమ కోసం స్పెషల్ గా రూపొందించిన సినిమా, సిరీస్ లు ఇప్పుడు మరో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేశాయి. రెండు వెబ్ సిరీస్ లు, ఓ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ వెబ్ సిరీస్ లు.. 90'స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) కాగా, సినిమా ఏమో లిటిల్ హార్ట్స్.

సూపర్ హిట్ సిరీస్

ఈటీవీ విన్ అనగానే ఇప్పుడు అందరికీ ముందుగా 90'స్ మిడిల్ క్లాస్ బయోపిక్ గుర్తుకొస్తుంది. ఈ వెబ్ సిరీస్ తో ఈటీవీ విన్ ఓటీటీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. శివాజీ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రతి తెలుగు ఇంటికి రీచ్ అయింది. ఇందులో మన 90'స్ రోజుల నాటి కుటుంబం, పాఠశాలలు, చదువు, అప్పటి పరిస్థితులను చక్కగా చూపించారు. ఈ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఏఐఆర్ సిరీస్

మరో ఈటీవీ విన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్). ఇది ప్రతి ఇంటర్ స్టూడెంట్ స్టోరీ అంటూ ఓటీటీలోకి వచ్చి సత్తాచాటింది. ఇందులో ముగ్గురు ఇంటర్ ఫ్రెండ్స్ కథను చూపించారు. పిల్లలపై పేరెంట్స్ ఆశలు, స్టూడెంట్స్ పై తల్లిదండ్రుల ప్రెషర్, కొన్ని ఇంటర్ కాలేజీల దోపిడి తదితర విషయాలను చాలా రియలిస్టిక్ గా చూపించారు. దీంతో ఈ సిరీస్ కూడా జనాల్లోకి త్వరగా వెళ్లిపోయింది.

బ్లాక్ బస్టర్ మూవీ

లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లో పెను ప్రకంపనలు నమోదు చేసిన చిత్రం ఇది. ఇది కూడా ఈటీవీ విన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిందే. థియేటర్లో ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత ఎక్స్ టెండెడ్ కట్ తోనూ ఓటీటీలోకి అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More