నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే.. టాప్‌లో రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్.. తమిళ థ్రిల్లర్ మూవీస్ హవా

నెట్‌ఫ్లిక్స్ లో రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇండియాలో నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఇక టాప్ 10లో తమిళ థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది.

Published on: Dec 8, 2025, 15:23:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి గత వారమే అడుగుపెట్టిన రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ అప్పుడే తొలి స్థానంలోకి దూసుకెళ్లింది. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందనడానికి ఇదే నిదర్శనం. సోమవారం (డిసెంబర్ 8) నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో ఏమేం ఉన్నాయో ఒకసారి చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే.. టాప్‌లో రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్.. తమిళ థ్రిల్లర్ మూవీస్ హవా
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే.. టాప్‌లో రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్.. తమిళ థ్రిల్లర్ మూవీస్ హవా

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్

నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో రష్మిక మందన్న లీడ్ రోల్లో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ ఉంది. గత శుక్రవారమే (డిసెంబర్ 5) ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. మూడు రోజుల్లోనే టాప్ లోకి దూసుకెళ్లడం విశేషం. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

టాక్సిక్ రిలేషన్షిప్ లో చిక్కుకునే భూమా అనే అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమా తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ థ్రిల్లర్ మూవీస్ హవా

ఇక టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో రెండు, మూడు స్థానాల్లో తమిళ థ్రిల్లర్ మూవీస్ నిలిచాయి. ఇందులో నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే వచ్చిన స్టీఫెన్ మూవీ రెండో స్థానంలో ఉంది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. 9 మంది అమ్మాయిలను హత్య చేసే ఓ సైకో కిల్లర్ తర్వాత తనకు తానుగా పోలీసులకు లొంగిపోతాడు. అసలు అతడు ఎందుకలా చేశాడు? తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

ఇక మూడో స్థానంలో ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన మరో తమిళ థ్రిల్లర్ ఆర్యన్ ఉంది. విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ సినిమా కూడా ఓ సైకో కిల్లర్ గా మారిన రైటర్, అతడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా చేసే ఐదు హత్యల చుట్టూ తిరిగే స్టోరీ.

టాప్ 10 ట్రెండింగ్‌లో మిగిలిన సినిమాలు ఇవే

ఇక టాప్ 3లో ఈ తెలుగు, తమిళ సినిమాలు ఉండగా.. నాలుగో స్థానంలో జాన్వీ కపూర్ నటించిన సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి ఉంది. ఐదో స్థానంలో ట్రోల్ 2 ఉండగా.. ఆరో స్థానంలో హిందీ లీగల్ కామెడీ డ్రామా జాలీ ఎల్ఎల్‌బీ 3 నిలిచింది. ఏడో స్థానంలో మరో తెలుగు మూవీ, రవితేజ నటించిన మాస్ జాతర ఉంది. ఇక 8వ స్థానంలో అనూహ్యంగా ఓ పాత మూవీ అయిన బ్యాండ్ బాజా బారాత్ నిలవడం విశేషం. 9వ స్థానంలో మరో తమిళ రొమాంటిక్ కామెడీ డ్యూడ్, 10వ స్థానంలో హిందీ మూవీ హోమ్‌బౌండ్ నిలిచాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More