ఓటీటీ ట్రెండింగ్‌లో భ‌య‌పెట్టే థ్రిల్ల‌ర్‌- ఫ‌స్ట్ మ‌ల‌యాళ హార‌ర్ కామెడీ సిరీస్- ఇన్‌స్పెక్షన్ బంగ్లా రివ్యూ

జీ5 లో కొత్తగా విడుదలైన 'ఇన్‌స్పెక్షన్ బంగ్లా' సిరీస్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మలయాళం ఫస్ట్ హారర్ కామెడీ సిరీస్ అని చెబుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూసేయండి. 

Published on: Nov 17, 2025 7:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చిన మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ ‘ఇన్‌స్పెక్షన్ బంగ్లా’ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇది ఫస్ట్ మలయాళ హారర్ కామెడీ సిరీస్ గా గుర్తింపు పొందింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు సైజు ఎస్ఎస్ డైరెక్టర్.

ఇన్‌స్పెక్షన్ బంగ్లా పోస్టర్
ఇన్‌స్పెక్షన్ బంగ్లా పోస్టర్

ఇన్‌స్పెక్షన్ బంగ్లా రివ్యూ

హారర్ కామెడీ థ్రిల్లర్ ఇన్‌స్పెక్షన్ బంగ్లా ఓటీటీలో అదరగొడుతోంది. ఇది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం హారర్-కామెడీగా అతీంద్రియ శక్తులను, చిన్న పట్టణ పోలీసు డ్రామాను కలపడానికి ప్రయత్నించింది సిరీస్. కాగితంపై ఈ కాన్సెప్ట్ నిజంగా ఆకట్టుకునేలా ఉంది. అరవంగడ్ అనే గ్రామంలోని శిథిలమైన పోలీస్ స్టేషన్, దెయ్యాలున్నాయని నమ్మే ప్రభుత్వ బంగ్లా.. ఇలా స్టోరీ లైన్ బాగానే ఉంది. మరి ఇన్‌స్పెక్షన్ బంగ్లా ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూసేయండి.

దెయ్యాలంటే భయం

ఈ సిరీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ విష్ణు (శబరీష్ వర్మ) చుట్టూ తిరుగుతుంది. అతను భయస్తుడు. దెయ్యాలు అంటే భయపడే అధికారి. స్థానిక పోలీస్ స్టేషన్ దెబ్బతినడంతో, అధికారులు ఖాళీగా ఉన్న ఇన్‌స్పెక్షన్ బంగ్లాకు మారవలసి వస్తుంది. ఈ భవనం దెయ్యాలతో నిండి ఉందని పేరుంది. తొలి ఎపిసోడ్‌లు ఈ ఉత్కంఠను బాగానే పెంచుతాయి. పారానార్మల్ పరిశోధకురాలు మిథిలి (ఆధ్య ప్రసాద్) ప్రవేశం, శాస్త్రీయ వివరణలు, అతీంద్రియ మలుపులు, ఆసక్తికరమైన పాత్రల డైనమిక్స్‌కు అవకాశం కల్పిస్తుంది.

ఫస్ట్ హాఫ్ ఓకే

రివ్యూ కోసం ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ను రెండు పార్ట్ లుగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తోంది. ప్రారంభంలో విచిత్రమైన నేరాలు, దెయ్యాల సంఘటనలతో సిరీస్ స్పష్టమైన దిశలో సాగుతున్నట్లు కనిపిస్తుంది. శిథిలమైన బంగ్లాను పనిచేసే పోలీస్ స్టేషన్ గా మార్చడానికి విష్ణు ప్రయత్నాలు ఇంట్రెస్టింగ్, కామెడీగా ఉంటాయి. కానీ మధ్యలోనే సిరీస్ పట్టు తప్పింది.

ఉత్కంఠ లేకుండా

హారర్ థ్రిల్లర్లలో ప్రధాన అంశమే ఉత్కంఠ. కానీ ఇన్‌స్పెక్షన్ బంగ్లా సిరీస్ లో నిజమైన ఉత్కంఠ కానీ భయం కానీ కనిపించదు. ఇది హారర్, కామెడీ, ఇన్వెస్టిగేటివ్ డ్రామా చుట్టూ తిరుగుతుంది. కానీ ఏ ఒక్కదానిలోనూ బలమైన ప్రభావం చూపలేదు. సస్పెన్స్‌ను బలోపేతం చేయాల్సిన హారర్ పార్ట్ నిరాశపరిచే విధంగా ఉంది. హాస్య ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. కామెడీ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అంతంతమాత్రమే.

ఎవరెలా చేశారంటే?

విష్ణుగా శబరీష్ వర్మ, మిథిలిగా ఆధ్య ప్రసాద్ యాక్టింగ్ ఆకట్టుకుంది. తమ పాత్రలను మెరుగ్గా పోషించారు. విలన్ త్రయం ఆశ్చర్యకరంగా బలంగా ఉంది. కొన్ని సన్నివేశాలను వారే మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇన్‌స్పెక్షన్ బంగ్లా సిరీస్ స్టోరీ పర్వాలేదు. ప్రయత్నం కూడా పర్వాలేదు. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.